Puri Ratha Yatra: ఈనెల 12వ తేదీతో ముగియునున్న జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు.. ఏ రోజు ఏ ఆచారం నిర్వహిస్తారంటే..
పది రోజుల పాటు జరిగే జగన్నాథ రథయాత్ర పండుగలో వివిధ పూజలను నిర్వహిస్తారు. ఈసారి రథయాత్ర ఉత్సవాలు జూలై 12వ తేదీతో ముగియనున్నాయి. ఏ రోజు ఏ ఆచారం నిర్వహించబడుతుంది .. ఆ ఆచారం అర్థం ఏమిటి ఈరోజు తెలుసుకుందాం..
Puri Ratha Yatra 2022: జూలై 1 న జగన్నాథ యాత్ర ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జగన్నాథ రథ యాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున ప్రారంభమౌవుతుంది. ఈ జగన్నాథ యాత్ర ఉత్సవం దాదాపు పది రోజుల పాటు జరుగుతుంది. జగనన్న యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ యాత్రలో పాల్గొనడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తీరిపోతాయని నమ్ముతారు. అందుకే జగన్నాథ యాత్రకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ పండుగలో వివిధ పూజలను నిర్వహిస్తారు. ఈసారి రథయాత్ర ఉత్సవాలు జూలై 12వ తేదీతో ముగియనున్నాయి. ఏ రోజు ఏ ఆచారం నిర్వహించబడుతుంది .. ఆ ఆచారం అర్థం ఏమిటి ఈరోజు తెలుసుకుందాం…
గాయక గార్డు రథయాత్ర రోజున మూడు రథాలు బయలుదేరే ముందు ఈ ఆచారం నిర్వహిస్తారు. దీని తరువాత.. మూడు రథాలపై చెక్క గుర్రాలను ఉంచుతారు. అప్పుడు జగన్నాథుని భక్తులు దాదాపు మూడు కిలోమీటర్లు ఈ రథాలను లాగుతారు. దీని తరువాత, మూడు రథాలలో స్వారీ చేస్తూ, భగవంతుడు తన అత్త గుండిచా గుడికి చేరుకుంటాడు. అక్కడ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ముగ్గురూ తిరిగి వస్తారు.
రథయాత్ర జూలై 9న తిరిగి వస్తుంది జగన్నాథ రథ యాత్ర మొదలైన పదో తేదీన తిరిగి రథాలు ఆలయానికి చేరుకుంటాయి. ఈ సమయంలో అన్ని రథాలను ఆలయం ముందుకి తీసుకువస్తారు. అయితే విగ్రహాలు ఒక రోజు రథంలో ఉంటాయి. అత్త ఇంట్లో విశ్రాంతి తీసుకున్న జగన్నాథుడు తన సోదరి సుభద్ర ,అన్నయ్య బలరాంతో కలిసి ఇంటికి తిరిగి జూలై 9వ తేదీన వస్తాడు.
దేవశయని ఏకాదశి దేవశయని ఏకాదశి రోజున పుణ్యస్నానాలు జరిపిస్తారు. దేవశయని ఏకాదశి హిందూ సంప్రడ్యాంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మూడు రథాలు ఆలయ సింహద్వారానికి చేరుకుంటాయి. ఈ రోజున స్వామివారు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఈసారి ఈ ఆచారం జూలై 10న జరగనుంది.
అధర పణ కర్మ బావి నుండి తీసిన నీరు, వెన్న, పనీర్, పంచదార, అరటిపండు, జాజికాయ, ఎండుమిర్చి, ఇతర మసాలా దినుసులను జోడించి పానా తయారు చేస్తారు. ఈ నీటిని దేవునికి సమర్పిస్తారు. దీనినే అధర్ పణ కర్మ అంటారు. ఈసారి ఈ క్రతువు జూలై 11న జరగనుంది.
పది రోజుల పండుగలో చివరి ఆచారం నీలాద్రి బిజ్. దీంతో జగన్నాథ రథయాత్ర పండుగ ముగియనుంది. ఇందులో, శ్రీ మందిర గర్భగుడిలోని రత్నసింహాసనం పై భగవంతుడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అధిష్టిస్తారు. ఈ ఏడాది ఈ ఆచారం జూలై 12న జరగనుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..