PM Modi: మీరు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం.. ఆధ్యాత్మిక బౌద్ద గురువు దలైలామాకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..
Dalai Lama Birthday: టిబెటన్ల ఆధ్యాత్మిక బౌద్ద గురువు దలైలామా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..
Dalai Lama birthday: టిబెటన్ల ఆధ్యాత్మిక బౌద్ద గురువు దలైలామాకు(Dalai Lama ) 87వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఆయన పుట్టినరోజు సందర్భంగా మోదీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు. దలైలామా 1959లో చైనా నుంచి భారత్ వచ్చిన తర్వాత ఇక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకులలో ఆయన ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్లు 14వ దలైలామా 87వ జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (CTA) ధర్మశాలలో దలైలామా 87వ పుట్టినరోజును నిర్వహించింది. బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు, పాఠశాల విద్యార్థులు, విదేశీయులతో సహా వందలాది మంది టిబెటన్లు ప్రధాన బౌద్ధ దేవాలయమైన సుగ్లాగ్‌ఖాంగ్ వద్ద సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు.
టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న తర్వాత..
దలైలామా టిబెట్‌లో అతిపెద్ద మత గురువు. 1959లో అప్పటి చైనా ప్రభుత్వం టిబెట్‌ను ఆక్రమించుకుంది. చైనా దురాగతాల కారణంగా దలైలామా భారత్‌కు వచ్చారు. దలైలామా రహస్యంగా భారతదేశానికి చేరుకున్న తర్వాత.. చైనా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. దలైలామా మీది కోపాన్ని చైనా భారత్‌పై చూపించింది. దీంతో 1962 సంవత్సరంలో భారత్‌పై దాడి చేసింది. టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాతే భారత్‌తో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి. గతంలో చైనా, భారత్ సరిహద్దుల మధ్య ప్రత్యేక టిబెట్ దేశంగా ఉండేది. దలైలామాతో పాటు ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. అప్పటి నుంచి టిబెటన్ ప్రవాస ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పని చేస్తోంది.
దలైలామా గురంచి..
ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ బౌద్ధమత అధిపతి 14 వ దలైలామా టెన్జిన్ గయాట్సో పుట్టిన రోజు ఇవాళ. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచానికి దలై లామా సుపరిచితులే అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికతపై, రాజకీయాలపై, ప్రంపచంలో వెలుగుచూస్తున్న అణచివేతపై గళం విప్పిన గొప్ప వ్యక్తి దలైలామా. తన పూర్వీకుల మాదిరిగా కాకుండా.. తెలిసిన విషయాన్ని ప్రపంచ సంక్షేమం కోసం వినియోగించాలని తపించిన మహానుభావుడు. శాంతి సందేశాన్ని విశ్వ వ్యాప్తం చేయాలని కంకణం కట్టుకున్నారు దలై లామా.
Conveyed 87th birthday greetings to His Holiness the @DalaiLama over phone earlier today. We pray for his long life and good health.
— Narendra Modi (@narendramodi) July 6, 2022
ఈ నేపథ్యంలోనే అనేక పుస్తకాలు రచించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని శాంతి ప్రవచనాలు పలికారు. “శాంతి” గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దలైలామా ఇచ్చే ప్రసంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వింటారు. మెక్లియోడ్ గంజ్‌లో నివాసం ఉంటుంన్న దలైలామా.. టిబెటన్ బౌద్దమత ఆధ్యాత్మిక అధిపతిగా, 14వ దలైలామాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ ఆధ్యాత్మిక గురువు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చైనా నుంచి విముక్తి తీసుకొచ్చి.. టిబెట్ల స్వాతంత్ర్య తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. గత అనేక దశాబ్దాలుగా అహింసతో పోరాడుతున్నారు. వారి మాతృభూమిపై సంస్కృతి హక్కుపై అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పించారు. చైనా నాశనం చేసిన వేలాది బౌద్ధ ఆరామాలను పునరుద్ధరణ, వందలాది మంది స్వాతంత్ర్యం బీజింగ్ స్వాధీనం చేసుకున్న టిబెటన్లు ఉద్యమిస్తున్నారు.