AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Significance Of Gorintaku: ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు..

Gorintaku: ఆషాడ మాసం వచ్చిందంటే మనలో చాలా మంది తమ చేతులకి గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు..? దీని వల్ల ఆరోగ్యానికి లాభం ఏంటో తెలుసుకుందాం..

Significance Of Gorintaku: ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు..
Gorintaku
Sanjay Kasula
|

Updated on: Jul 05, 2022 | 8:03 AM

Share

“గోరింట పూచింది కొమ్మ లేకుండా..” ఈ పాట విన్న ప్రతిసారి ఓ ఫీల్ కలుగుతుంది. ఆషాడ మాసంలో ఈ గోరింటాకుకు ఓ ప్రత్యేకత ఉంది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా.. ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అది ఎర్రగా పండితే మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.. జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి. ఇలాంటి మార్పు మొదలైన కాలంను ఆషాడం మాసం అని పిలుస్తాం. ఆషాడం వచ్చిదంటే చాలు వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది. దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది.

గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమై గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు. అందుకే మనవారు చెప్పినట్లుగా ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే కాదు ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారు. అంతెందుకు ఈ మధ్య ఈ ఫ్యాషన్ తిరిగి వచ్చింది. గత రెండేళ్లుగా యువకులు కూడా పెట్టుకుంటున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు.

ఆషాఢంలోనే ఎందుకు..

ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

సైంటిఫిక్ రీజన్..

శాస్త్రీయంగా చూస్తే గర్భాశయదోషాలను తొలిగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. గోరింటాకు పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ అని అంటుంటారు అందేకే.. సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేనిది. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కలు..

ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటిషన్లు. గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొద్దిగా చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక.. అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి.. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగార్ లేదా ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకుని చేతులకి రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

సో, ఇన్ని లాభాలు ఉన్నా గోరింటాకుని మీరు మిస్ కావొద్దు.. ఇక ఆలస్యమెందుకు ఈ రోజు గోరింటాకు తెచ్చుకుని చేతులను అందంగా మార్చుకోండి.

Follow Us