Vastu Tips: మీ ఇంట్లో ఈ పాత వస్తువులు ఉన్నాయా ?.. వాటిని వదిలించుకోండి.. లేకుంటే..

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రాహు, కేతువులు, శని ఎక్కువ కాలం ఉపయోగించని వస్తువులను నివాసంగా మలుచుకుంటారట.

Vastu Tips: మీ ఇంట్లో ఈ పాత వస్తువులు ఉన్నాయా ?.. వాటిని వదిలించుకోండి.. లేకుంటే..
Old Things
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 06, 2022 | 9:43 AM

సాధారణంగా కొన్ని వస్తువులతో విలువైన జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. వాటితో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. వాటిని ఇంట్లోనే భద్రంగా దాచుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రాహు, కేతువులు, శని ఎక్కువ కాలం ఉపయోగించని వస్తువులను నివాసంగా మలుచుకుంటారట. దీంతో ఎప్పటికీ ఉపయోగించని వస్తువులు ఇంట్లో ఉండే అవి చెడు శకునంగా భావిస్తారు. అలాంటి కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందామా.

ఇత్తడి పాత్రలు.. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వస్తువుల వాడకం తగ్గిపోయింది. వీటిని ఎక్కువగా స్టోర్ రూమ్ లలో ఉంచుతున్నారు. అయితే వీటిలో శని ఆవాసంగా మార్చుకుంటాడట. ఇవి ఎక్కువ కాలం ఇంట్లో ఉంటే జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా ధనం పట్ల ఆకర్షితులవుతారు.

పాత బట్టలు.. పాత బట్టలు, పరుపులు, బొంతలు, షీట్స్ వంటివి స్టోర్ రూమ్ లలో పెట్టేస్తారు. వీటిని అలా భద్రపరచడం వలన జాతకంలో బుధగ్రహం స్థానం క్షీణిస్తుంది. అలాగే పాత బట్టలను ఎండలో వేస్తారు. ఇలా చేయడం వలన రాహు కేతవుల ప్రతికూల శక్తి ఇంట్లో పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి.

తుప్పు పట్టిన వస్తువులు.. ఇంట్లో ఇనుప పనిముట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇవి ఎక్కువ రోజులు ఉండడం వలన తుప్పు పట్టేస్తాయి. ఇంట్లో ఈ తుప్పు పట్టిన వస్తువులు ఉండడం వలన ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వాస్తు ప్రకారం పదునైన వస్తువులు, తుప్పు పట్టిన వస్తువులు మరింత ప్రమాదకరం. వీటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు.

కుట్టు మెషన్.. చాలా మంది ఇళ్లలో కుట్టు మిషన్స్ ఉంటాయి. అయితే వీటిని ఎక్కువ కాలం ఉపయోగిస్తుంటారు. కొందరు కుట్టు మిషన్ ఉపయోగించకుండా ఖాళీగా పక్కన పెట్టేస్తుంటారు. దీనిని వాడకుండా ఉంచడం వలన ఇందులో రాహు, శని ఉంటారట. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. దీంతో ఇంట్లో గొడవలు పెరుగుతాయి.

ఆగిపోయిన గడియారం.. ఇంట్లో ఉండే గడియారాలు పాడవుతుంటాయి. కొందరు వాటిని తీసి స్టోర్ రూమ్ లో పెట్టేస్తారు. వాస్తు ప్రకారం ఏ దిశలోనైనా ఉంచిన గడియారాలు, ఉపయోగించని గడియారాలు… వ్యక్తులకు చెడు సమయాలను తెస్తాయి. అలాంటి గడియారాలను దానం చేస్తే మంచిది.

Note: ఈ కథనం కేవలం నమ్మకాలు.. వాస్తు నివేదికల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.