Horoscope Today: వీరు సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు.. బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (06-07-2022): ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అలాగే రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని..

Horoscope Today: వీరు సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు.. బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Basha Shek

|

Updated on: Jul 07, 2022 | 6:37 AM

Horoscope Today (06-07-2022): ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం కోసం వెతుకుతారు చాలామంది. అలాగే రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందోనని ఆరా తీస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 6 (బుధవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

కీలక పనుల్లో సమయస్ఫూర్తిగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సానుకూల ఫలితాలు పొందుతారు. సమస్యల పరిష్కారంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. పెద్దల సలహాలు, సూచనలు మేలు చేకూరుస్తాయి.

ఇవి కూడా చదవండి

వృషభం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో బంధు, మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం పఠిస్తే మంచి కలుగుతుంది.

మిథునం

చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. కుటుంబ సభ్యులు, బంధువులు, తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మీయులను దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు చేకూరుతుంది.

కర్కాటకం

కీలక విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. సంతానానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే శుభం కలుగుతుంది.

సింహం

ఈ రాశివారికి దైవానుగ్రహం పుష్ఠిగా ఉంటుంది. అందుకే చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొంటారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.

కన్య

ఆయా రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. మంచి మనసుతో తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే శుభప్రదం.

తుల

కీలక వ్యవహారాలు, పనుల్లో ఆత్రత పనికిరాదు. పెద్దల సలహాలు, సూచనలతో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. అనవసర ఖర్చుల పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి జపిస్తే బాగుంటుంది.

వృశ్చికం

స్థిరమైన ఆలోచనావిధానంతో సానుకూల ఫలితాలు సాధిస్తారు. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మంచిది.

ధనస్సు

ఆయా రంగాల్లో రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా చక్కపడతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల సహకారం లాభిస్తుంది. ఇష్ట దైవారాధన మానవద్దు.

మకరం

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. అయినా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేయగలుగుతారు. మనోధైర్యమే మీకు రక్షగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

కుంభం

స్థిరమైన ఆలోచనలతో ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపార వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. అష్టమంలో చంద్రసంచారం వల్ల కొన్ని సమస్యలు కలుగుతాయి. శివారాధనతో శుభం కలుగుతుంది.

మీనం

ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబీకులు, బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆదిత్యహృదయం చదవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?