Vinayaka Chaviti: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. పూజా నియమాల గురించి తెలుసుకోండి
ఈ ఏడాది 31 ఆగస్టు 2022న న వినాయక చవితి పండగను జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్ గా నిలిచింది. ఎందుకంటే ఈ పర్వదినం బుధవారం నాడు వచ్చింది.
Vinayaka Chaviti: సనాతన హిందూ సంప్రదాయంలో ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించాలని నమ్మకం. విఘ్నాలకు అధిపతి గణపతిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకాలు ఉండవని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. శివపార్వతుల ముద్దుల తనయుడు గణేశుడి పుట్టిన రోజుని వినాయక చవితిగా హిందువులు జరుపుకుంటారు. ఈ ఏడాది 31 ఆగస్టు 2022న న వినాయక చవితి పండగను జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి వెరీ వెరీ స్పెషల్ గా నిలిచింది. ఎందుకంటే ఈ పర్వదినం బుధవారం నాడు వచ్చింది. వినాయక చవితి ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన నియమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
వినాయక చవితి పూజ నియమాలు
- గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, అది పగలకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి పూజకు వినాయకుడు కూర్చున్న విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా, కుడి వైపునకు తొండం వంగి ఉన్న గణపతి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి వినాయక విగ్రహం సంతోషాన్ని, అదృష్టాన్ని అందిస్తూ అన్ని కోరికలను నెరవేరుస్తుందని విశ్వాసం
- వాస్తు ప్రకారం రెండు గణపతి విగ్రహాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అదేవిధంగా గణపతి విగ్రహాన్ని ఈశాన్యంలో ఉంచి పూజ చేయాలి. గణేశుడికి వీపు కనిపించని విధంగా ఉంచాలి.
- గణపతి పూజను నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి చేయకూడదు. ఐశ్వర్యం, అనుగ్రహం పొందడానికి వినాయకుడి పూజకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి.
- గణేష్ ఆరాధనలో.. అతనికి ఇష్టమైన వస్తువులను మాత్రమే సమర్పించాలి. తులసిని పూజకు, నైవేద్యంలో ఉపయోగించకూడదు. తులసి వినాయకుడి పూజకు నిషేధించబడింది.
- గణేష్ చతుర్థి పూజ , ఉపవాసం స్వచ్ఛమైన శరీరం, మనస్సుతో చేయాలి. ఈ పవిత్ర రోజు ఎవరికీ చెడు చేయాలనే ఆలోచనల కలగనీయవద్దు. అబద్ధం చెప్పకండి. వినాయకచవితి రోజున కోపంతో.. లేదా దూషించే మాటలు మాట్లాడవద్దు
- గణేష్ చతుర్థి ఉపవాసం చేసే సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉపవాసం రోజున శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు.
- గణపతికి ఉపవాసం ఉండే వ్యక్తి సాత్విక పండ్లను మాత్రమే తినాలి.
- గణేష్ చతుర్థి రోజున ఎలుకలను వేధించకూడదు లేదా చంపకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)