Chanakya Niti: ఈ సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తాయి.. అయితే మంచి, లేదంటే వినాశనమే..!

Chanakya Niti: ఆచార్య చాణక్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపారమైన మేధా శక్తి, దూరదృష్టితో, అద్భుతమైన వ్యూహ ప్రతివ్యూహాలు..

Chanakya Niti: ఈ సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తాయి.. అయితే మంచి, లేదంటే వినాశనమే..!
Chanakya Niti Rules Main
Follow us

|

Updated on: Aug 22, 2022 | 1:16 PM

Chanakya Niti: ఆచార్య చాణక్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపారమైన మేధా శక్తి, దూరదృష్టితో, అద్భుతమైన వ్యూహ ప్రతివ్యూహాలు కలిగిన గొప్ప వ్యక్తిగా నాడు, నేడు కీర్తించబడిన, బడుతున్నాడు. ఆర్థిక శాస్త్రంలో, రాజనీతిలో నిపుణుడిగా పేరుగాంచిన మహా శక్తి ఆచార్య చాణక్యుడు. అందుకే ఆయనను అపర చాణక్యుడు అంటారు. అయితే, ఇంతటి చాణక్యుడు తన జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకూ అందించారు. ఒక వ్యక్తి జీవితం ఉన్నతంగా, విజయవంతం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎలా పరిష్కరించాలి.. ఆ సమస్యల వలయం నుంచి ఎలా బయటపడాలి.. ఇలా అనేక అంశాలతో కూడిన గ్రంధాన్ని రచించారు. అదే నీతిశాస్త్రం. ఈ నీతిశాస్త్రం గ్రంధంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ఇందులో పేర్కొన్న అంశాలు నాడు, నేడు, భవిష్యత్ ప్రజలూ ఆచరించదగ్గవి కావడం చేతనే.. ఆచార్య చాణక్యకు ఇప్పటికీ అంత ఖ్యాతి ఉంది. అయితే, ఇందులో భాగంగానే జీవితంలో సంతోషం, దుఃఖం వస్తూనే ఉంటాయని, అయితే, చెడు పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తామో అది మన భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తుందని చాణక్యుడు పేర్కొన్నారు. కొన్ని అదృష్టాన్ని దురదృష్టంగా మారుస్తాయి. మరి ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలనేది కూడా ఆయన పేర్కొన్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారీగా డబ్బు కోల్పోయినప్పుడు..

ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనుషులకు లేదంటే అతిశయోక్తి కాదు. డబ్బుల కోసం ఎంతకైనా తెగించే పరిస్థితులు నేడు ఉన్నాయి. ఈ డబ్బు విలువ, అవసరాలు తెలిసి చాలా మంది డబ్బును దాచుకుంటారు. కొన్ని కొన్నిసార్లు ఆ దాచిన డబ్బు కోల్పోతారు. ఆ సమయంలో చాలా మంది తట్టుకోలేరు. తీవ్ర నష్టాన్ని భరించలేక.. కష్టపడి కూడబెట్టిన సొమ్ము కోల్పోవడంతో డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది జీవితంలో అతి పెద్ద మార్పునకు నాంది. దీన్ని జ్ఞాపకంగా పెట్టుకుని భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరుగకుండా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

జీవిత భాగస్వామితో విడిపోవడం..

ఏదైనా కారణాల చేత జీవిత భాగస్వామి వదిలేస్తే.. ఆ జీవితం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చాణక్యుడు పేర్కొన్నారు. పెళ్లి అయ్యాక జీవిత భాగస్వామి సపోర్ట్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కానీ, ఒక్కోసారి విడిపోయేంత వరకు పరిస్థితులు రావొచ్చు. అది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి రోజూ దుఃఖమయంగా సాగే పరిస్థితి ఉంటుంది. ఇది కూడా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

తల్లిదండ్రుల నుంచి దూరం..

మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్ప విజయం సాధించినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం. తల్లిదండ్రులకు దూరం ఉండటాన్ని మించిన ఎడబాటు మరొకటి ఉండదు. తల్లిదండ్రులు లేని లోటును ఏదీ భర్తి చేయదు. జీవితంలో ఏదో ఒక కారణంతో తల్లిదండ్రుల నుంచి విడిపోవాల్సి వస్తే అది చాలా బాధాకరమైన అంశం. అయితే, ఇది జీవితంలో అతిపెద్ద మార్పునకు అవకాశం కూడా అని చాణక్యుడు అభిప్రాయపడ్డారు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..