Vastu Shastra: ఉదయం లేచిన వెంటనే మర్చిపోయి కూడా వీటిని చూడొద్దు.. కాదంటే కష్టాలు తప్పవు..!
Vastu Shastra: మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఆ రోజు ఏదైనా చెడు జరిగినా, మరేదైనా కీడు జరిగినా.. ఛీ ఉదయాన్నే ఎవరి మొఖం చూశామో,

Vastu Shastra: మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఆ రోజు ఏదైనా చెడు జరిగినా, మరేదైనా కీడు జరిగినా.. ఛీ ఉదయాన్నే ఎవరి మొఖం చూశామో, ఏం చూశామో అని నిట్టూరుస్తుంటారు. అవును ఆ మాటలు నిజమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయాన్నే కొన్ని కొన్ని అంశాలను, వస్తువులను అస్సలు చూడకూడదు. కాదని చూస్తే ఆ రోజంతా దాని ప్రభావం ఉంటుందని, అస్సలు మంచి జరుగదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చాలా మందికి నిద్ర లేవగానే అద్దంలో చూసుకోవడం, జుట్టు దువ్వుకోవడం, పాచి గిన్నెల వద్దకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ, అలా చేయడం వల్ల తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు వాస్తు పండితుంది. మరి ఉదయాన్ని లెవగానే వేటిని చూడొద్దు.. చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జంతువులు, పక్షుల చిత్రాలు: హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం సమయం శుభప్రదమైనది. ఈ సమయంలో పూజాధికాలు చేస్తే మంచి జరుగుతుందంటారు. అయితే, ఉదయాన్నే లేచిన వెంటనే జంతువులు, పక్షుల చిత్రాలను చూడొద్దని జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాదని చూస్తే రోజంతా చెడు ఫలితాలే ఉంటాయి. ఎవరోతైనా వివాదం జరిగే అవకాశం ఉంది.
పాడైపోయిన గడియారం: ఇంట్లో ఆగిపోయిన గడియారం అస్సలు ఉండొద్దు. ఆగిపోయిన గడియారాన్ని పడేయాలి. ఉదయాన్నే ఆగిపోయిన గడియారం వైపు పొరపాటున కూడా చూడొద్దు. ఇది చెడు కాలానికి ప్రతీకగా సూచిస్తున్నారు.
అద్దం: మన శరీరంలో ఉండే నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉదయం పూట నిద్రలేవగానే.. అద్దంలో ముఖాన్ని చూసుకోవడం వలన అరిష్టం కలుగుతుంది. ఆర్థిక నష్టంతోపాటు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఉదయాన్నే ముందుగా ముఖం కడుక్కోవడం గానీ, స్నానం చేయడం గా చేసిన తరువాత అద్దంలో ముఖం చూసుకోవాలి.
వాడిపడేసిన పాత్రలు: రాత్రిపూట వంటగదిలో ఉంచిన పాచి గిన్నెలు ఇంట్లో దరిద్రాన్ని కలిగిస్తాయి. ఈ పాచిగిన్నెలను ఉదయాన్నే లేవగానే చూస్తే మరింత దరిద్ర వెంటాడుతుంది. అందుకే, రాత్రి గిన్నెలను రాత్రే క్లీన్ చేసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




