అక్కడ ఎనిమిదేళ్ల బాలికకు వివాహం జరుగుతున్నా ఎవ్వరూ అడ్డుకోరు.. అడ్డుకోలేరు..
అరవ వంశంకు చెందిన వంశస్థులు గడిచిన 80 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరవ వంశంకు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో వివాహం జరిపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యక్ష కన్యాదానం పేరుతో బాలికను భాజా భజంత్రీలుతో తీసుకొచ్చి.. ఆలయంలోనే శ్రీవారితో వివాహం జరిపిస్తారు.
ఎనిమిదేళ్ల బాలికకు వివాహం చేస్తుంటే ఎవరూ అడ్డ్డుకోరు. అదీ వేద పండితులు మంత్రోచ్ఛారణ.. భాజా భజంత్రీలు.. కుటుంబ సభ్యులు అందరూ దగ్గరుండి పెళ్లి జరిపిస్తారు. ఎనిమిదేళ్ల బాలికకు పెళ్లి ఏంటి అనుకుంటున్నారా? అక్కడ అదొక సాంప్రదాయం… ప్రత్యక్ష కన్యాదానం అనే ఒక వింత ఆచారంతో… శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో ఎనిమిదేళ్ల బాలికకు వివాహం జరిపిస్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8 ఏళ్ల బాలికతో సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం శ్రీవారి కల్యాణం జరుగుతుంది.
అరవ వంశంకు చెందిన వంశస్థులు గడిచిన 80 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరవ వంశంకు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో వివాహం జరిపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యక్ష కన్యాదానం పేరుతో బాలికను భాజా భజంత్రీలుతో తీసుకొచ్చి.. ఆలయంలోనే శ్రీవారితో వివాహం జరిపిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం 8 ఏళ్ల బాలికతో వివాహం జరిపించడం వల్ల.. శ్రీవారితో పెళ్లి అయిన ఆ బాలికకు మంచి భర్త దొరుకుతాడని స్థానికుల విశ్వాసం. పురోహితులే మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి.. శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పసుపు కొమ్ము కడతారు.
తరువాత మంగళసూత్రాన్ని బాలిక తల్లి బాలిక మెడలో కట్టడంతో ఆ పెళ్లి తంతు ముగుస్తుంది. ఇలా ఏటా అరవ వంశంకు చెందిన 8 ఏళ్ల బాలికకు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో వివాహం చేయటం ఒక సాంప్రదాయంగా వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..