Garuga Puranam: ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని గుర్తించండి.. ఎప్పటికీ మోసపోరు

కొన్ని సంకేతాలు గరుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి..అలాంటి వాటిలో ఒకటి అబద్ధం చెప్పే వ్యక్తుల లక్షణాలు..వీటిని గుర్తిస్తే ఎవరైనా మీకు అబద్ధం చెబుతున్నారా లేదా నిజం చెబుతున్నారా అని మీరు సులభంగా కనుగొనవచ్చని గరుడ పురాణం పేర్కొంది. మోసపోవడానికి అసలు కారణం ఏమిటంటే.. ఎదుటి వారు మనతో అబద్ధం చెబుతున్నాడనే విషయం అర్థం చేసుకోలేకపోవడం. దీంతో అబద్ధాలకోరు చెప్పే విషయాలను నమ్మి.. ఘోరంగా మోసపోతారు. అయితే గరుడ పురాణంలో పేర్కొన్న ఈ సంకేతాలతో ఎవరైనా అబద్ధాలు చెబుతుంటే సులభంగా గుర్తించవచ్చు.

Garuga Puranam: ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని గుర్తించండి.. ఎప్పటికీ మోసపోరు
Garuda Puranam
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2024 | 7:33 PM

హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణానికి అధిపతి శ్రీ హరి నారాయణుడే. గరుడ పురాణంలో పక్షి రాజు గరుత్మంతుడు, శ్రీ మహా విష్ణువు మధ్య ప్రశ్న, సమాధానంగా వివరించబడింది. ఇందులో పాపం-పుణ్యం, జననం-మరణం, స్వర్గం-నరకం, పునర్జన్మలతో పాటు, మతం, జ్ఞానం, నీతి, నియమాలు మొదలైన వాటి గురించి కూడా వివరించబడింది. వీటిని అనుసరించిన వ్యక్తులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని, పాప కర్మలకు దూరంగా ఉంటాడని విశ్వాసం. అలాంటి కొన్ని సంకేతాలు గరుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి..అలాంటి వాటిలో ఒకటి అబద్ధం చెప్పే వ్యక్తుల లక్షణాలు..వీటిని గుర్తిస్తే ఎవరైనా మీకు అబద్ధం చెబుతున్నారా లేదా నిజం చెబుతున్నారా అని మీరు సులభంగా కనుగొనవచ్చని గరుడ పురాణం పేర్కొంది.

  1. మోసపోవడానికి అసలు కారణం ఏమిటంటే.. ఎదుటి వారు మనతో అబద్ధం చెబుతున్నాడనే విషయం అర్థం చేసుకోలేకపోవడం. దీంతో అబద్ధాలకోరు చెప్పే విషయాలను నమ్మి.. ఘోరంగా మోసపోతారు. అయితే గరుడ పురాణంలో పేర్కొన్న ఈ సంకేతాలతో ఎవరైనా అబద్ధాలు చెబుతుంటే సులభంగా గుర్తించవచ్చు.
  2. కదలికలు, సంజ్ఞలు, ప్రసంగం ద్వారా కూడా అబద్ధం చెప్పే వ్యక్తులను గుర్తించవచ్చు. కళ్ళు, మాటలలో విడుపు ద్వారా మనస్సు గ్రహించవచ్చునట.
  3. శరీర ఆకృతి, కదలిక, కదలికలు, సంకేతాలు, మాటలు, కళ్ళు, ముఖ కవళికలతో మనిషి మనస్సులో ఆలోచించే విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చని గరుడ పురాణంలో పేర్కొంది.వివిధ సంకేతాల ఆధారంగా అబద్ధాలను చెప్పే వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు.
  4. కళ్ళ భాషను అర్థం చేసుకోండి: ఒక వ్యక్తి మీతో మాట్లాడే సమయంలో అతని కళ్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. అతను మీతో అబద్ధం చెబుతున్నట్లు అయితే అతను దూరంగా చూడటానికి ప్రయత్నిస్తాడు లేదా అతని చూపు ఒకే చోట స్థిరంగా ఉండదు. మాట్లాడుతున్నంత సేపు అటు ఇటూ చూస్తూనే ఉంటాడు.
  5. కూర్చునే విధానం: కొంతమంది మాట్లాడే సమయంలో చేతులు, కాళ్ళను నిరంతరంగా కదుపుతూ ఉంటారు. మరికొందరు కాళ్ళమీద కాలు వేసుకుని అడ్డంగా పెట్టుకుని కూర్చుంటారు. ఎవరైనా సరే అబద్ధాలు చెప్పినప్పుడు ఇలా చేస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఏ వ్యక్తిలోనైనా సరే సాధారణ అలవాట్లలో మార్పును గమనిస్తున్నట్లు అయితే అతను మీతో అబద్ధం చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి అని పేర్కొంది.
  6. వంగి కూర్చునే భంగిమ: ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని రహస్యాలు అతని బాడీ లాంగ్వేజ్‌లో దాగి ఉన్నాయని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా సరే మీ మాట వింటున్నట్లు నటిస్తుంటే, లేదా మీరు చెబుతున్న సమయంలో గంభీరంగా ఉండకుండా.. అప్పుడు అతని భుజాలు వంగి కూర్చుని ఉంటే అబద్ధాలు చెప్పే వ్యక్తి అని అర్ధమట. భుజాలు వంచి, కాళ్ళను కదిలించడం ప్రారంభించడం, చేతులు కొంచెం వణుకుతూ ఉంటే అతను తన అబద్దాలను గుర్తు పడతారని భయపడుతున్నట్లు అర్ధం అట.
  7. పని చేసే విధానం: గరుడ పురాణం ప్రకారం ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు అతని శారీరక శ్రమలో మార్పు వస్తుంది. తరచుగా మాట్లాడేటప్పుడు పొరపాట్లు చేస్తాడు లేదా త్వరగా తన వాక్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు తన పనిని త్వరగా చేయడం ప్రారంభిస్తాడు లేదా చాలా నీరసంగా ఉంటాడు. అంటే ఎవరైనా అకస్మాత్తుగా ఒక వ్యక్తి శారీరక కదలికలలో మార్పును గమనించినట్లయితే.. అతను అబద్ధం చెబుతున్నాడని అర్థం చేసుకోండి.
  8. ముఖ కవళికలు: ముఖ కవళికలను బట్టి వ్యక్తి నిజం చెబుతున్నాడా లేదా అబద్ధాన్ని చెబుతున్నాడా అనే విషయాన్ని గుర్తించవచ్చు.
  9. బాడీ లాంగ్వేజ్‌లో మార్పు: ఒక వ్యక్తి మీ నుండి ఏదైనా దాచడానికి ప్రయత్నించినప్పుడు.. అతని బాడీ లాంగ్వేజ్, చర్యలలో మార్పు కనిపిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ చర్యలపై శ్రద్ధ చూపిస్తే అవతలి వారు అబద్ధాలు చెబుతున్నట్లు గుర్తించవచ్చు.
  10. స్వరంలో కంపన: గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి ఏదైనా విషయం దాస్తున్నా లేదా అబద్ధం చెప్పేటప్పుడు కొంచెం భయం, భయంగా కనిపిస్తాడు. అంతేకాదు అతని గొంతులో అసాధారణ హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తాయి. కొన్నిసార్లు చాలా నిదానంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడటం మొదలుపెడతాడు. కొన్నిసార్లు మధ్య మధ్యలో మాటలను మింగుతాడు. ఏ వ్యక్తిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే అతను మీతో అబద్ధం చెబుతున్నాడని అర్థం చేసుకోండి. అతని మనసులో ఏదో ఉంది..అతని నోటితో ఇంకేదో చెబుతున్నాడని అర్ధమట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు