AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పెయిన్ వీధుల్లో యువతుల శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్..

'సకల్ బనా' పాట మాత్రం జనాలకు బాగా నచ్చుతోంది. అందుకే దీనిపై రీళ్లు, వీడియోలు రూపొందిస్తూ హల్చల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్ సందడి చేస్తున్నాయి. ఒకరికి ఒకరు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో స్పెయిన్‌కు చెందినది అని తెలుస్తోంది. ఇక్కడ ఇద్దరు మహిళలు ఈ పాటలో సంప్రాదాయ దుస్తులతో దేశీ లుక్‌లో ప్రదర్శన ఇస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇద్దరు మహిళలు ఈ పాటకు క్లాసికల్ స్టైల్‌ని జోడించడం.

స్పెయిన్ వీధుల్లో యువతుల శాస్త్రీయ నృత్యం.. హిరమండి పాటకు క్లాసికల్ టచ్..
Classical Dance On Sakal BanImage Credit source: Instagram
Surya Kala
|

Updated on: May 21, 2024 | 4:33 PM

Share

హీరామండి: ది డైమండ్ బజార్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ మే 1న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. వెబ్ సిరీస్ అద్భుతంగా ఉందనే టాక్ తో పాటు దీనిలోని పాటలు కూడా విపరీతంగా జనాలను ఆకర్షిస్తున్నాయి. ఇందులోని దాదాపు అన్ని పాటలు రాగం ఆధారంగా రూపొందించబడినప్పటికీ..చిత్రంలోని ‘సకల్ బనా’ పాట మాత్రం జనాలకు బాగా నచ్చుతోంది. అందుకే దీనిపై రీళ్లు, వీడియోలు రూపొందిస్తూ హల్చల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్ సందడి చేస్తున్నాయి. ఒకరికి ఒకరు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో స్పెయిన్‌కు చెందినది అని తెలుస్తోంది. ఇక్కడ ఇద్దరు మహిళలు ఈ పాటలో సంప్రాదాయ దుస్తులతో దేశీ లుక్‌లో ప్రదర్శన ఇస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇద్దరు మహిళలు ఈ పాటకు క్లాసికల్ స్టైల్‌ని జోడించడం. ఇద్దరు డ్యాన్సర్లలో ఒకరు ఈ పాటకు ఒడిస్సీ చేస్తుంటే.. మరొకరు భరతనాట్య శైలిలో తన ప్రతిభను చాటుతున్నారు. ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో కనిపిస్తున్న మహిళల్లో ఒకరి పేరు వినతా శ్రీరామ్‌కుమార్ కాగా, మరొకరి పేరు మొహంతి. వినత పర్పుల్ బంగారు చీరను ధరించి భరతనాట్య శైలిలో నృత్యం చేస్తుంటే మొహంతి అందమైన బూడిద-గులాబీ రంగు కాంబినేషన్ చీరలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. ఈ ప్రదర్శనలో వారి సమన్వయం, కలయిక అద్భుతమైనది. ప్రజలు వీరి నృత్యాన్ని చాలా ఇష్టపడుతున్నారు.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లోకి వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. దీనితో పాటు ‘హీరామండి’లోని ఈ అందమైన ట్రాక్ ‘సకల్ బనా’పై మేము డ్యూయెట్ వెర్షన్‌ను రూపొందించాము, ఇప్పుడు ఈ బీట్‌లలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్‌ రూపంలో చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు దానిపై కామెంట్ చేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం ప్రారంభించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘మీ ఇద్దరి డ్యాన్స్ అద్భుతంగా ఉంది, ఇది చూడటం సరదాగా ఉంది.’ మరొకరు, ‘ఎవరి డ్యాన్స్ ను ఉత్తమంగా పిలవాలో తెలియక తికమకపడుతున్నాను’ అని రాశారు. ఇది కాకుండా, చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా