ఎర్రగా కనిపిస్తుందని పుచ్చకాయను తినేస్తున్నారా.. క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..కల్తీ పుచ్చకాయను ఇలా గుర్తించండి..

రసాయనాలు కలిగిన పుచ్చకాయలు త్వరగా పాడవుతాయి. అంతేకాదు వీటిల్లో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఎరిథ్రోసిన్ ఇంజెక్ట్ చేసిన విషయం అర్థం చేసుకోలేని ప్రజలు ఎర్రగా ఉంది.. రుచికరంగా ఉంది అంటూ అలాంటి పుచ్చకాయలను తింటారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు కారణం కావచ్చు. దీని కారణంగా, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, కడుపు ఇన్ఫెక్షన్ కూడా సంభవించవచ్చు.

ఎర్రగా కనిపిస్తుందని పుచ్చకాయను తినేస్తున్నారా.. క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..కల్తీ పుచ్చకాయను ఇలా గుర్తించండి..
Adulteration Watermelon
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2024 | 2:41 PM

ఇది వేసవి కాలం, వడగాల్పులు, ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది ఇష్టంగా పుచ్చకాయను తింటారు. పుచ్చకాయ రుచికరంగా ఉండడమే కాదు.. శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. అయితే పుచ్చకాయ ఎర్రగా కనిపించేందుకు రసాయనాలు కలుపుతారని మీకు తెలుసా! ఈ రసాయనం పుచ్చకాయను లోపలి నుండి ఎర్రగా మారుస్తుంది. అయితే ఈ విషయం అంత సులభంగా గుర్తించలేము.

పుచ్చకాయను ఎర్రగా మార్చడానికి ఇంజెక్ట్ చేసే రసాయనాన్ని ఎరిథ్రోసిన్ అంటారు. ఎరిథ్రోసిన్ ఒక రకమైన రసాయన సమ్మేళనం. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (EFSA) ప్రకారం ఎరిథ్రోసిన్ E127గా వర్గీకరించబడింది. దీనిని కొన్ని రకాల కాక్‌టెయిల్‌లు, సిరప్‌లలో మాత్రమే ఉపయోగించాలి. అయితే భారతదేశంలో వేసవి వస్తే చాలు పుచ్చకాయ అమ్మకాలు పెంచేందుకు పుచ్చకాయ లోపల గుజ్జు ఎరుపు రంగులో కనిపించడానికి ఎరిథ్రోసిన్ ను ఇంజెక్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఎరిథ్రోసిన్ అనేక విధాలుగా శరీరానికి హాని కలిగిస్తుంది. ఎరుపుగా ఉందని ఎరిథ్రోసిన్ రసాయనాన్ని కలిపిన పుచ్చకాయను తినడం వలన కలిగే నష్టాలు అపారం అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఎరిథ్రోసిన్ శరీరానికి ఎలా హాని చేస్తుందంటే ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో డాక్టర్ అంకిత్‌కుమార్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఎరిథ్రోసిన్ ఒక రసాయనం. ఇది గులాబీ రంగులో ఉంటుంది. దీనిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. కొన్ని సిరప్‌లకు రంగును ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు పుచ్చకాయకు ఎర్రపు రంగు రావడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఎరిథ్రోసిన్ ను పుచ్చకాయలో ఇంజెక్ట్ చేస్తున్నారు. దీని కారణంగా లేత పుచ్చకాయ కూడా లోపల ఎరుపు రంగులోకి మారి ముదురు పుచ్చకాయ అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏ వ్యాధుల ప్రమాదం ఎరిథ్రోసిన్ అధిక మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తే.. శరీరానికి హాని కలిగిస్తుంది. ఎలుకలపై నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో కూడా ఎరిథ్రోసిన్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడైంది. అంటే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయినప్పటికీ మానవులలో ఎరిథ్రోసిన్ వలన క్యాన్సర్ ప్రభావం గురించి ఎటువంటి పరిశోధన లేదు. అయినప్పటికీ దీని వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటువంటి కల్తీ పుచ్చకాయ కడుపు నొప్పి, వాంతులు మరియు విరేచనాలకు కారణమవుతుంది.

కల్తీ పుచ్చకాయలు త్వరగా పాడవుతాయి రసాయనాలు కలిగిన పుచ్చకాయలు త్వరగా పాడవుతాయి. అంతేకాదు వీటిల్లో ఫంగస్ పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఎరిథ్రోసిన్ ఇంజెక్ట్ చేసిన విషయం అర్థం చేసుకోలేని ప్రజలు ఎర్రగా ఉంది.. రుచికరంగా ఉంది అంటూ అలాంటి పుచ్చకాయలను తింటారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ సమస్యకు కారణం కావచ్చు. దీని కారణంగా, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, కడుపు ఇన్ఫెక్షన్ కూడా సంభవించవచ్చు.

పుచ్చకాయ కల్తీనో కాదో ఎలా తెలుసుకోవాలంటే.. అయితే పుచ్చకాయ సహజంగా పండింగా.. ఎరిథ్రోసిన్ ను ఇంజెక్ట్ చేసి పండించరా అన్న విషయం తెలుసుకోవడం కొంచెం కష్టం. అయితే దీని కూడా ఒక సింపుల్ చిట్కా ఉంది. మీరు మార్కెట్ కు పుచ్చకాయ కొనడానికి వెళ్లినప్పుడు ఒక దూది ఉండను తీసుకుని వెళ్లండి. అక్కడ మీరు కొనాలనుకున్న పుచ్చకాయను చిన్న ముక్క కట్ చేసి ఇవ్వమని చెప్పి.. అలా కత్తిరించి ముక్కపై దూదిని రుద్దండి. అప్పుడు ఆ దూదికి ఎరుపు లేదా గులాబీ రంగు అడ్డుకుని కనిపించినట్లయితే.. ఆ పుచ్చకయలో రసాయనం కలిపినట్లు అర్థం. అది కల్తీ పుచ్చకాయ. దూదికి ఎటువంటి రంగు లేకపోతే పుచ్చకాయ సహజంగా పండిందని ఎటువంటి కల్తీ లేదని అర్ధం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..