Hypertension Control Tips: ఇవి మూలికలు కావు దివ్యౌషధాలు.. వీటితో హై బీపీని కంట్రోల్‌కి తీసుకురావడం పక్కా..!
హైబీపీ రావడానికి ఒక్కటేంటి.. చాలా కారణాలే ఉన్నాయి. బీపీ అనేది చాప కింద నీరులా వస్తుందని ఆరోగ్య నిపుణులే చాలా సార్లు చెప్పారు. బీపీ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువ అవుతాయి. షుగర్ ఉన్నవారు, బరువు ఉన్నవారికి కూడా బీపీ అనేది వస్తుంది. బీపీ వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. వెంటనే వైద్యుల సలహాలు..
హైబీపీ రావడానికి ఒక్కటేంటి.. చాలా కారణాలే ఉన్నాయి. బీపీ అనేది చాప కింద నీరులా వస్తుందని ఆరోగ్య నిపుణులే చాలా సార్లు చెప్పారు. బీపీ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఎక్కువ అవుతాయి. షుగర్ ఉన్నవారు, బరువు ఉన్నవారికి కూడా బీపీ అనేది వస్తుంది. బీపీ వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. అలాగే ఏ ఆహారాలు పడితే వాటిని తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పే మూలికలు తరచుగా తీసుకుంటే మాత్రం.. బీపీని కంట్రోల్ చేయవచ్చు.
బ్రాహ్మి ఆకులు:
బీపీ కంట్రోల్ చేయడంలో బ్రాహ్మి ఆకులు చక్కగా పని చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్త పోటు తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతుంది. తరచుగా బ్రాహ్మి ఆకుల రసం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
తులసి ఆకులు:
తులసి ఆకులు మనకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. తులసి ఆకులతో బీపీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో యూజినాలన్ అనే రసాయనం.. రక్తపోటును తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. తులసి ఆకుల్ని నమిలినా.. లేక రసం తాగినా ఎలా తీసుకున్నా బీపీ తగ్గుతుంది.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క కూడా మనకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. దాల్చిన చెక్క తీసుకుంటే బీపీనే కాదు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఆయుర్వేదంలో దాల్చిన చెక్కను వివిధ సమస్యలు తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. దాల్చిన చెక్క టీ తాగినా.. పొడి నీళ్లలో కలుపుకుని తీసుకున్నా.. మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లిని కూడా మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలించి బీపీని నియంత్రిస్తుంది.
ఉసిరి:
ఉసిరితో కూడా మనం హైబీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీంతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. రోజుకు ఓ ఉసిరి తింటే.. బీపి తగ్గుతుంది. ఉసిరిని పచ్చడిలా తీసుకోవచ్చు. పొడిలా, ఉసిరి రసాన్ని కూడా తాగవచ్చు. ఎలా తీసుకున్నా.. బీపీ తగ్గడంతో పాటు చర్మానికి, జుట్టుకు కూడా మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..