Almond: మీరు తినే బాదం అసలివేనా.. నకిలీవా.? ఇలా తెలుసుకోండి..
బాదంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మంచి బాదంతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో నకిలీవి తింటే అదే స్థాయిలో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అన్నీ నకిలీ వస్తువులు తయారవుతోన్న...
బాదంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మంచి బాదంతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో నకిలీవి తింటే అదే స్థాయిలో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అన్నీ నకిలీ వస్తువులు తయారవుతోన్న వేళ బాదంను కూడా కొందరు కేటుగాళ్లు నకిలీవి చేసి విక్రయిస్తున్నారు. దీంతో ఇవి తిన్న వారి ఆరోగ్యంపాడవుతుంది. మరి మనం తింటున్న బాదం అసలా.? నకిలీవా.? ఇలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* మంచి బాదం పప్పుల రంగు లేత గోధుమ రంగులో ఉంటాయి. అలాగే వాటి ఆకారం కొద్దిగా పొడవుగా, గుండ్రంగా ఉంగాయి. నకిలీ బాదంపప్పుల రంగు ముదురు రంగులో ఉంటాయి. వాటి ఆకారం కూడా సమానం ఉండవు. బాదంపప్పు రంగు, ఆకారం సరిగా లేకుంటే అవి నకిలీవని గుర్తించవచ్చు.
* ఇక అసలైన బాదం రుచి తీపిగా ఉంటుంది. నకిలీ వాటి రుచి చేదుగా ఉంటుంది. బాదంపప్పులు సరిగ్గా రుచి చూడకపోతే అవి నకిలీవి కావొచ్చని అర్థం చేసుకోవాలి.
* ఇక మంచి బాదం కొద్దిగా తీపి వాసన కలిగి ఉంటుంది. బాదంపప్పులు వింతగా లేదా చెడుగా అనిపిస్తే, అవి నకిలీవి కావచ్చు. నకిలీ బాదం వాసన తరచుగా అసలైన బాదంకు భిన్నంగా ఉంటుంది.
* బాదం పప్పు నాణ్యతను గుర్తించడానికి కాసేపు వాటిని నీటిలో వేసి ఉంచాలి. మంచి బాదం నీటిలో నెమ్మదిగా నానిపోతుంది, అలాగే వాటి రంగు మారదు. అదే నకిలీ అయితే త్వరగా తడిసిపోయి వాటి రంగు నీటిలో కలిసిపోతాయి.
* అసలైన బాదం తొక్క సన్నగా ఉంటుంది. తొలగిస్తుంటే సులభంగా వస్తుంది. అదే నకిలీ బాదంపై ఉండే పొర మందంగా ఉంటుంది.
* అన్నింటికంటే ముఖ్యంగా బాదం పప్పులను లూజ్‌గా కాకుండా ఏదైనా మంచి బ్రాండ్‌కు చెందినవి కొనుగోలు చేయాలి. వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నా నాణ్యత బాగుంటాయి.
* అలాగే ప్యాకింగ్ కవర్‌పై తయారు తేదీ, ఎక్స్పైరీ తేదీలను గమనించిన తర్వాతే కొనుగోలు చేయాలి. ఎక్స్పైరీ తేదీ దాటిన బాదంలను తీసుకోకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..