AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Diet: వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం ఎంతో సులభమో.. తగ్గడం అంత కష్టం. బరువు తగ్గాలి అనుకునే వారు మంచి డైట్ తీసుకోవడంతో పాటు.. వ్యాయామం కూడా చేయాలి. అలాగే ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం కంట్రోల్ చేయాలి. అలా అయితేనే మీరు త్వరగా బరువు తగ్గగలరు. లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం..

Weight Loss Diet: వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా.. ఈ బెస్ట్ డైట్ మీ కోసమే!
Weight Loss diet
Chinni Enni
|

Updated on: May 21, 2024 | 1:24 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం ఎంతో సులభమో.. తగ్గడం అంత కష్టం. బరువు తగ్గాలి అనుకునే వారు మంచి డైట్ తీసుకోవడంతో పాటు.. వ్యాయామం కూడా చేయాలి. అలాగే ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం కంట్రోల్ చేయాలి. అలా అయితేనే మీరు త్వరగా బరువు తగ్గగలరు. లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తుంటే.. మీ కోసమే హెల్దీ డైట్‌ని మీ కోసం తీసుకొచ్చాం. ఇవి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. వీటిని ఫాలో చేస్తూ.. వ్యాయామం చేస్తే.. మీకు నెల రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ చూసేయండి.

కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి:

ఇండియన్ ఫుడ్‌లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్సే ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నవారు.. కార్బోహైడ్రేట్స్ ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా.. డయాబెటీస్ కూడా వస్తుంది. అన్నం తక్కువగా తినండి. కూరలు ఎక్కువగా తీసుకోండి.

ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి:

మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి.. తక్కువగా తిన్నా పొట్ట నిండాలి. అలాంటప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇందులో పండ్లు, కూరగాయలు కూడా వస్తాయి. ఇవి ఎలానో ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి.. పండ్లు తింటూ ఉండండి.

ఇవి కూడా చదవండి

బ్రేక్ ఫాస్ట్:

వెయిట్ లాస్ అయ్యేవాళ్లు దోశ, ఇడ్లీ, పొంగల్, పూరీ, బజ్జీలు వంటివి అస్సలు తీసుకోవద్దు. వీటి వల్ల ఆకలి అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోండి. ఉదయం గుడ్డు, పెరుగు, పండ్లు, నట్స్ వంటివి తినడం బెటర్.

వీటి జోలికి అస్సలు పోవద్దు:

బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నారు.. బియ్యం, నూనె, బేకరీ ఫుడ్స్, బ్రెడ్, పాస్తా. ట్రాన్స్ ఫ్యాట్స్, చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్, తీపి పదార్థాలు, డీప్ ఫ్రై ఫుడ్స్‌ని అస్సలు తీసుకోవద్దు. వీటి వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది విపరీతంగా పెరిగి పోతుంది. అదే విధంగా వ్యాయామం చేస్తే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో