Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??

అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??

Phani CH

|

Updated on: May 21, 2024 | 6:14 PM

తరచూ మన బ్యాంక్‌ ఎకౌంట్‌ చెక్‌ చేసుకుంటూ ఉంటాం. ఎకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉంది? ఇంకా ఈ నెల మొత్తం గడవడానికి అది సరిపోతుందా? ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళిక వేసుకోడానికి తరచూ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకుంటాం. అలాంటప్పుడు ఒక్కసారిగా మన ఎకౌంట్‌లోకి ఊహించని విధగంగా వేల కోట్ల రూపాయలు వచ్చి పడితే? పడ్డాయ్‌... అవును కానీ మన ఎకౌంట్‌లో కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఎకౌంట్‌లో ఏకంగా 9,900 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి.

తరచూ మన బ్యాంక్‌ ఎకౌంట్‌ చెక్‌ చేసుకుంటూ ఉంటాం. ఎకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉంది? ఇంకా ఈ నెల మొత్తం గడవడానికి అది సరిపోతుందా? ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళిక వేసుకోడానికి తరచూ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకుంటాం. అలాంటప్పుడు ఒక్కసారిగా మన ఎకౌంట్‌లోకి ఊహించని విధగంగా వేల కోట్ల రూపాయలు వచ్చి పడితే? పడ్డాయ్‌… అవును కానీ మన ఎకౌంట్‌లో కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఎకౌంట్‌లో ఏకంగా 9,900 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత జరిగిన పొరపాటును గ్రహించి బ్యాంకు దానిని సరిచేసుకుంది. ఇతని ఎకౌంట్‌ ఖాళీ అయింది. అకస్మాత్తుగా తన అకౌంట్లో సుమారు రూ.9,900 కోట్లు కనిపించడంతో ఓ వ్యక్తి షాకయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని బదోహీ జిల్లాకు చెందిన భాను ప్రకాశ్ అనే వ్యక్తికి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కిసాన్ క్రిడెట్ కార్డు లోన్ అకౌంట్ ఉంది. అయితే, బ్యాంకు దృష్టిలో ఈ అకౌంట్ NPA అంటే నిరర్థక ఆస్తిగా మారింది. ఈ క్రమంలో తలెత్తిన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా అతడి అకౌంట్లో ఒక్కసారిగా రూ 99,99,94,95,999.99 (Rs 99 billion 99 crore 94 lakh 95 thousand and 999)లు దర్శనమిచ్చాయి. దీంతో, షాకైన భాను ప్రకాశ్ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా కౌంట్‌లో అంత మొత్తం కనిపించిందని భాను ప్రకాశ్‌కు తాము వివరించామని,పొరపాటు సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని, అకౌంట్ దుర్వినియోగం కాకుండా ముందుజాగ్రత్త చర్యగా దాన్ని హోల్డ్‌లో పెట్టినట్టు బ్యాంక్ మేనేజర్ రోహిత్ గౌతమ్ తెలిపారు. NPAలకు సంబంధించిన అకౌంట్లపై కొన్ని పరిమితలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ అకౌంట్లతో మరిన్ని ఇబ్బందులు రాకుండా ఫ్రీజ్ చేస్తాము. భాను ప్రకాశ్ తన అకౌంట్ చెక్ చేసినప్పుడు అది NPA ఆంక్షల కారణంగా నెగెటివ్‌లో కనిపించింది. పరిస్థితిని అతడికి వివరించి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము అని ఆయన తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ??

‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..

నాకు అన్యాయం జరిగింది.. త్రివిక్రమ్‌ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌

హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??