AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Phani CH
|

Updated on: May 20, 2024 | 6:48 PM

Share

కన్న బిడ్డలకు తల్లిదండ్రులను మించిన రక్షణ ఇంకేముంటుంది? ఏదైనా ఆపద సంభవించినప్పుడు బిడ్డలను తల్లిదండ్రులు ప్రాణాలు పెట్టయినా కాపాడుకుంటారు. అలాగే ఎటునుంచి ఏ ఆపద వస్తుందోనని తమ పిల్లలకు తల్లిదండ్రులు ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటారు. ఇది కేవలం మానవాళికి మాత్రమే కాదు. సృష్టిలోని ప్రతి జీవికీ వర్తిస్తుందనిపిస్తోంది ఈ దృశ్యం చూస్తుంటే. అవును పశుపక్ష్యాదులు సైతం తమ బిడ్డలను అవిస్వతంత్రంగా జీవించేంతవరకూ కంటికి రెప్పలా కాపాడుకుంటాయి.

కన్న బిడ్డలకు తల్లిదండ్రులను మించిన రక్షణ ఇంకేముంటుంది? ఏదైనా ఆపద సంభవించినప్పుడు బిడ్డలను తల్లిదండ్రులు ప్రాణాలు పెట్టయినా కాపాడుకుంటారు. అలాగే ఎటునుంచి ఏ ఆపద వస్తుందోనని తమ పిల్లలకు తల్లిదండ్రులు ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటారు. ఇది కేవలం మానవాళికి మాత్రమే కాదు. సృష్టిలోని ప్రతి జీవికీ వర్తిస్తుందనిపిస్తోంది ఈ దృశ్యం చూస్తుంటే. అవును పశుపక్ష్యాదులు సైతం తమ బిడ్డలను అవిస్వతంత్రంగా జీవించేంతవరకూ కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. ఓ ఏనుగుల గుంపు ఓ చిన్నారి ఏనుగును కాపాడుకుంటున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ లో ఓ ఏనుగుల కుటుంబం నిద్రిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ తల్లి ఏనుగు, రెండు సోదర ఏనుగుల మధ్య ఓ బుజ్జి ఎలిఫెంట్ ఆదమరిచి నిద్రపోతోంది. మరో ఏనుగు మాత్రం నిలబడి పహారా కాస్తున్నట్లు కనిపించింది. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ధను పరణ్ ఈ అందమైన దృశ్యాన్ని తన డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో తరచూ అడవి జంతువుల వీడియోలను షేర్ చేసే ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ లోని దట్టమైన అడవిలో ఒక అందమైన ఏనుగుల కుటుంబం నిద్రిస్తోంది. బుజ్జి ఏనుగుకు కుటుంబం ఎలా జెడ్ క్లాస్ భద్రత కల్పిస్తోందో చూడండి. కుటుంబ సభ్యులు నిద్రిస్తుంటే మరో ఏనుగు ఎలా పహారా కాస్తోందో గమనించండి. మన ఇళ్లలో కనిపించే దృశ్యం లాగానే ఉంది కదూ? అంటూ ఆమె ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇలాంటి అందమైన, అరుదైన దృశ్యాలను చూడటం అద్భుతం అని ఒకరు, కచ్చితంగా భద్రపరుచుకోవాల్సిన వీడియో ఇదంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..

నాకు అన్యాయం జరిగింది.. త్రివిక్రమ్‌ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌

హీరోయిన్‌కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??

Deepika Padukone: హీరోలను దాటి.. హాలీవుడ్ చరిత్రకెక్కిన దీపిక

పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…