Do You Know: అమ్మాయిలూ ఇది మీకు తెలుసా.! మగవారి గురించి 10 సీక్రెట్స్ ఇవే..
‘ఆడాళ్ల మనస్సు సముద్రమంత లోతు’ అంటుంటారు. మరి మగాడికి మనస్సుండదా.. ఉంటే అది లోతుగా ఉండదా.. అని సరదాగా సందేహం వచ్చినా దానికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్లెప్పుడు నిర్థిష్టంగా ఇలానే ఉంటారనేది లేదు. కానీ, మగాళ్లు అలా కాదు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
‘ఆడాళ్ల మనస్సు సముద్రమంత లోతు’ అంటుంటారు. మరి మగాడికి మనస్సుండదా.. ఉంటే అది లోతుగా ఉండదా.. అని సరదాగా సందేహం వచ్చినా దానికి సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్లెప్పుడు నిర్థిష్టంగా ఇలానే ఉంటారనేది లేదు. కానీ, మగాళ్లు అలా కాదు. దాదాపు మగాళ్లంతా ఏ పరిస్థితిలోనైనా.. ఒకేలా స్పందిస్తారు. మరి మగాళ్ల గురించి కొన్ని సైకలాజికల్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..
తన జీవితంలోకి రాబోయే యువతి ఎవరో తెలిశాక.. ఆమె కంటే వివాహం గురించే మగాళ్లు ఎక్కువగా ఆలోచిస్తారట. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. పొగడ్తలను అమ్మాయిల కంటే మగాళ్లే ఎక్కువగా ఇష్టపడతారట. లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం.. అలాగే కొత్త కొత్త ప్లేస్‌లను అన్వేషించడంలో అబ్బాయిలు ముందుంటారట. పైగా మగాళ్లు ఒత్తిడికి లోనైనప్పుడు మాత్రమే గట్టిగా అరిచి కోప్పడిపోతారట. సెక్సీగా ఉన్నవారు కనిపిస్తే చాలు.. మగాళ్లు వెంటనే ఆకర్షితులైపోతారట.
సాధ్యమైనంత వరకూ ఎవ్వరినీ సాయం అడగకుండానే సమస్యను పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపుతారట. మగాళ్లు వారి భావాలను కేవలం ప్రేమించిన వారితో మాత్రమే పంచుకుంటారట. తన ప్రియురాలి మాజీ ప్రియుడి గురించి వినడానికి సిద్ధంగా ఉన్నానని నటించినా.. అంతర్లీనంగా అందరు మగాళ్లు అయిష్టంగానే చెప్పమంటారట.