Char Dam Yatra: చార్‌ధామ్ యాత్ర ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్న భక్తులకు అలెర్ట్.. మే 31 వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల

నాలుగు ధామ్‌లలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ మే 31 వరకు మూసివేయనున్నామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న యాత్రికులు మాత్రమే ప్రస్తుతం యాత్రకు వెళ్లగలరు. ఇటువంటి పరిస్థితిలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న భక్తులు తమ రిజిస్ట్రేషన్ కోసం తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల వరకు వేచి ఉండవలసి ఉంటుంది.

Char Dam Yatra: చార్‌ధామ్ యాత్ర ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్న భక్తులకు అలెర్ట్.. మే 31 వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల
Char Dam Yatr2024
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2024 | 3:41 PM

హిందువులు ఎంతగానో ఎదురుచూసే చార్ ధామ్ కేదార్నాథ్ ఆలయ తలుపు తెరచుకోవడంతో ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఊహించిన దానికంటే యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు యాత్రకు పోటెత్తుతున్నారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిషేధించింది. చార్ ధామ్ యాత్ర కోసం హరిద్వార్, డెహ్రాడూన్‌లలో రవాణా శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. గత కొన్ని రోజులుగా ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

నాలుగు ధామ్‌లలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ మే 31 వరకు మూసివేయనున్నామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న యాత్రికులు మాత్రమే ప్రస్తుతం యాత్రకు వెళ్లగలరు. ఇటువంటి పరిస్థితిలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్న భక్తులు తమ రిజిస్ట్రేషన్ కోసం తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల వరకు వేచి ఉండవలసి ఉంటుంది.

మరో పదిరోజుల పాటు రిజిస్ట్రేషన్ కోసం వేచిచూడాలి డెహ్రాడూన్, హరిద్వార్ జిల్లాల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ క్యాంపులను ఏర్పాటు చేసింది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. యాత్రకు వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ కోసం ఎంత సమయం అయినా ఈ శిబిరాల్లో వేచి చూస్తున్నారు. మే 19న మళ్లీ ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని గతంలో చెప్పగా.. ఇప్పుడు మే 31 వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో ఇక్కడికి వచ్చిన భక్తులకు నిరాశే ఎదురైంది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మరో పదిరోజుల పాటు రిజిస్ట్రేషన్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

టూర్, ట్రావెల్స్ వ్యాపారులు అసంతృప్తి హరిద్వార్‌లోని DM, SSP స్థానిక టూర్, ట్రావెల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. మే 31 వరకు చార్ ధామ్ కొత్త భక్తులను ఆహ్వానించవద్దని ఆదేశాలు ఇచ్చారు. మే 15 నుంచి ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ మూసివేయబడిన తర్వాత.. వేలాది మంది పర్యాటకులు హరిద్వార్‌లోని హోటల్ ధర్మశాలలో ఉన్నారు. రిజిస్ట్రేషన్ తెరిచే సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇలా చార్ ధామ్ యాత్ర కోసం వేచి చూస్తున్న 1750 మంది భక్తులను చార్ ధామ్ యాత్రకు పంపినట్లు డీఎం ధీరాజ్ సింగ్ గర్బ్యాల్ తెలిపారు. ఇతర వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. కొత్త రిజిస్ట్రేషన్లు కౌంటర్లను ప్రస్తుతానికి మూసివేయనున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హరిద్వార్ టూర్ అండ్ ట్రావెల్స్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..