Peppar Fish Fry: రెస్టారెంట్ స్టైల్‌లో టేస్టీగా పెప్పర్ ఫిష్ ఫ్రై ని ఇంట్లోనే తయారు చేసుకోండి.. రెసిపీ మీకోసం
కొంతమందికి చేపల వేపుడు తినడం ఇష్టం. ముఖ్యంగా పెప్పర్ ఫిష్ ఫ్రై ని పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. పెప్పర్ ఫిష్ ఫ్రై స్నాక్ గా లేదా బిర్యానీ లేదా సాంబార్ అన్నంలోకి జత చేసి తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ పెప్పర్ ఫిష్ ఫ్రై ని తయారు చేసే విధానం తెలియక రెస్టారెంట్ ను ఆశ్రయిస్తారు. ఈ నేపధ్యంలో మిరియాల చేపల వేపుడుని రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీగా తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..
మాంసాహార ప్రియుల్లో సీఫుడ్ ప్రియులు వేరు.. చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటితో రకరకాల వంటలను ఇష్టంగా తింటారు కొందరు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులు తయారు చేసే చేపల పులుపు, చేపల వేపుడు, వంటి వాటిని ఇష్టంగా తినేవారు ఎందరో ఉన్నారు. అయితే కొంతమందికి చేపల వేపుడు తినడం ఇష్టం. ముఖ్యంగా పెప్పర్ ఫిష్ ఫ్రై ని పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. పెప్పర్ ఫిష్ ఫ్రై స్నాక్ గా లేదా బిర్యానీ లేదా సాంబార్ అన్నంలోకి జత చేసి తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ పెప్పర్ ఫిష్ ఫ్రై ని తయారు చేసే విధానం తెలియక రెస్టారెంట్ ను ఆశ్రయిస్తారు. ఈ నేపధ్యంలో మిరియాల చేపల వేపుడుని రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీగా తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..
పెప్పర్ ఫిష్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
- పండుగప్ప చేప ముక్కలు- తల, తోక లేని ముక్కలు
- ధనియాల పొడి – ఒక స్పూను
- మిరియాలు పొడి- రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర తరుగు కొంచెం
- పసుపు – కొంచెం
- కారం – ఒక స్పూను
- నూనె – ఫ్రై చేయడానికి సరిపడా
- ఉప్పు – రుచికి సరిపడా
- వెల్లుల్లి పేస్ట్
- ఉల్లిపాయ ముక్కలు
- వేయించిన కరివేపాకు
తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసి వాటిని కడిగి ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. కొంచెం నూనె వేసి తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో చేపల ముక్కలు వేసి వాటికీ ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి..మ్యారినేట్ చేసి ఒక పక్కకు పెట్టుకోండి. ఇలా సుమారు గంట పాటు చేప ముక్కలను పెప్పర్ మిశ్రంలో ఉంచి .. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద లోతుగా ఉండే పెనం పెట్టి.. నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఆ నూనె లో పెనం మీద అమర్చుకోవాలి. తక్కువ మంట మీద మెల్లగా అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేయించిన చేప ముక్కలపై కొత్తిమీర తరుగు వేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని దాని మీద వేయించిన కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీ టేస్టీ పెప్పర్ ఫిష్ ఫ్రై రెడీ..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..