వేసవిలో చల్ల చల్లగా గోండ్ కటీరా..! అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఇక అస్సలు వదిలిపెట్టరు..
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి మీకు తెలుసా..? ఇది ఎడిబుల్ గమ్. గోండ్ కటిర అనేది ఒక రకమైన హెర్బ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోండ్ కటిరా ప్రోటీన్ మంచి మూలం, మంచి మొత్తంలో మెగ్నీషియం, కాల్షియంను కలిగి ఉంటుంది. సమ్మర్‌లో గోండు కటిరా తినడం వల్ల శరీరంలోని హీట్ స్ట్రోక్, బలహీనత సమస్యను దూరం చేసుకోవచ్చు. అంతే కాకుండా మహిళల్లో పీరియడ్స్ సరిగా రాని సమస్యలు కూడా దూరమవుతాయి. దాని ప్రయోజనాలు తెలుసుకుందాం.
Updated on: May 21, 2024 | 8:53 PM

గోండ్ కటిర శరీర వేడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. వేసవిలో దీని షర్బత్ తాగడం వల్ల చల్లదనం లభిస్తుంది. ఇది శరీరానికి బలం, శక్తిని అందించే సహజ శక్తి బూస్టర్. క్రమం తప్పకుండా తినడం వల్ల అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. గోండ్ కటిరా చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. ఇది చర్మం మంట, చికాకును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది.

దగ్గు, విరేచనాలు వంటి అనేక ఆరోగ్య సంబంధిత పరిస్థితులను నయం చేయడానికి ఇది చాలా కాలంగా ఉపయోగించబడుతోంది. గోండ్ కటిరా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సహజమైన గమ్. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. గోండ్ కటిరా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.

గోండ్ కటిరా తినడం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గోండ్ కటిరాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది.

ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది.

ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్‌లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్‌లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని తాగేయాలి. కావాలంటే ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది.





























