Rare Blood Group: ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్.. ఎక్కడ ఎలా దొరుకుతాయంటే..

బాంబే బ్లడ్ గ్రూప్ గురించి కాబ‌ట్టి.. O గ్రూపులో ఉన్న‌ట్టుగానే బాంబే బ్లడ్ గ్రూప్‌లో ఎర్ర ర‌క్త క‌ణాల‌పై యాంటీ జెన్లు ఉండ‌వు. ప్లాస్మాపై A, B యాంటీ బాడీలు రెండూ ఉంటాయి. దీంతో O గ్రూప్ ర‌క్తాన్నే బాంబే బ్ల‌డ్ గ్రూప్ అని అనుకుని క‌న్‌ఫ్యూజ్ అవుతుంటారు. అది తెలియ‌క‌పోవ‌డంతో నిజంగా బాంబే బ్ల‌డ్ గ్రూప్ ఉన్న వారిని O గ్రూప్ అని భావించి వారికి అదే ర‌క్తాన్ని ఎక్కిస్తున్నారు. దీంతో ఆ ర‌క్తం ప‌డ‌క బాంబే బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వారు చ‌నిపోతున్నారు.

Rare Blood Group: ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్.. ఎక్కడ ఎలా దొరుకుతాయంటే..
Bombay Blood Group
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2024 | 8:10 PM

రక్తదానం చెయ్యాలన్నా రక్తం స్వీకరించాలన్నా రక్తం యొక్క గ్రూప్ తెలిసుండాలి. మనందరికీ తెలిసిన 8 బ్లడ్ గ్రూపులు కాకుండా రెండు అరుదైన గ్రూపులు కూడా ఉన్నాయి. అరుదైన బ్లడ్ గ్రూప్ అనగానే మనకి గుర్తొచ్చేవి A-ve, B-ve, O-ve, AB-ve ఇవేగా.. ఇవి కాకుండా ఇంకా అతి అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. అవేంటో తెలుసా? బాంబే బ్లడ్ గ్రూప్ రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్ రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా బ్లడ్ గ్రూప్‌ను నిర్ధారిస్తారు. శరీరంలో యాంటీజెన్ తక్కువగా ఉంటే అటువంటి బ్లడ్ గ్రూప్‌ను చాలా రేర్ గ్రూప్‌గా పరిగణిస్తారు. గత 52 సంవత్సరాల్లో కేవలం 43 మందికి మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగిటివ్ బ్లడ్ ఉన్నవారు ప్రపంచంలో ఎవరికైనా రక్తదానం చేయగలరు.

ఒక వ్యక్తి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా వారి బ్లడ్ గ్రూప్‌ను తెలుసుకోవచ్చు. అయితే ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను రేర్ గ్రూప్‌గా పరిగణిస్తారు.గడచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగిటివ్ బ్లడ్ కలిగినవారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు. మామాట: అరుదైన రక్త గ్రూపులు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఏం జరిగినా రక్తం దొరికే అవకాశాలు చాలా తక్కువ.

బాంబే బ్లడ్ గ్రూప్ అంటే… జన్యుపరంగా సంక్రమించే ఈ రకం బ్లడ్‌గ్రూప్‌ను ముంబై(ఒకప్పటి బొంబాయ్‌)కు చెందిన డాక్టర్ వైఎం బెండీ 1952లో గుర్తించారు. ఈ రక్తానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని నామకరణం చేశారు. అత్యంత అరుదైన ఈ రక్తం ఓ నెగిటివ్ గ్రూప్‌లోని మరో సబ్‌టైప్. దీనిని వైద్యపరిభాషలో ‘ఓహెచ్’గా పిలుస్తారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం మిలియన్ మందిలో నలుగురికి మాత్రమే ఉండే అవకాశం ఉందని నిపుణులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

దేశంలో అతి తక్కువ మందికి అవసరం… దేశంలో అతితక్కువ మందికే బాంబే బ్లడ్ గ్రూపు రక్తం అవసరం ఉందని తేలింది. దీంతో వీరంతా కలిసి బాంబే బ్లడ్‌గ్రూప్ డాట్ ఓఆర్‌జీ పేరిట ఓ వైబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ వైబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీరు డోనర్లు అవసరమైన రక్తాన్ని అందిస్తారు. ప్రస్థుతం ఈ వెబ్‌సైట్‌లో తొమ్మిది మంది తమకు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం అవసరమని తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన బేబీ సరియా అమీన్, అనంతపురంకు చెందిన శైలజలు ఉండడం గమనార్హం. ఈ వెబ్‌సైట్ విశ్లేషణ ప్రకారం మహారాష్ట్రలోనే ఈ బ్లడ్‌గ్రూప్ ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

బాంబే బ్లడ్ గ్రూప్ గురించి కాబ‌ట్టి.. O గ్రూపులో ఉన్న‌ట్టుగానే బాంబే బ్లడ్ గ్రూప్‌లో ఎర్ర ర‌క్త క‌ణాల‌పై యాంటీ జెన్లు ఉండ‌వు. ప్లాస్మాపై A, B యాంటీ బాడీలు రెండూ ఉంటాయి. దీంతో O గ్రూప్ ర‌క్తాన్నే బాంబే బ్ల‌డ్ గ్రూప్ అని అనుకుని క‌న్‌ఫ్యూజ్ అవుతుంటారు. అది తెలియ‌క‌పోవ‌డంతో నిజంగా బాంబే బ్ల‌డ్ గ్రూప్ ఉన్న వారిని O గ్రూప్ అని భావించి వారికి అదే ర‌క్తాన్ని ఎక్కిస్తున్నారు. దీంతో ఆ ర‌క్తం ప‌డ‌క బాంబే బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వారు చ‌నిపోతున్నారు.

మ‌రి బాంబే బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వారిని క‌నిపెట్ట‌లేమా..? అంటే చేయ‌వ‌చ్చు. అందుకు H యాంటీ జెన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాంటీ జెన్ రక్తంలో ఉంటే అది బాంబే బ్ల‌డ్ గ్రూప్ అవుతుంది. ఇందులోనూ పాజిటివ్‌, నెగెటివ్ అని మ‌ళ్లీ రెండు ర‌కాలు ఉంటాయి. పాజిటివ్ చాలా అరుదు అనుకుంటే నెగెటివ్ ఇంకా అరుదుగా ఉంటుంది. కొన్ని కోట్ల మందిలో బాంబే బ్ల‌డ్ గ్రూప్ నెగిటివ్ ఉన్న వారు ఒక్క‌రు ఉంటారు. ఇక ఇదే బ్ల‌డ్ గ్రూప్ పాజిటివ్ ఉన్న వారు 10వేల మందిలో ఒక్క‌రుంటారు.

ఈ బ్ల‌డ్ గ్రూప్‌కు బాంబే బ్ల‌డ్ గ్రూప్ అని పేరెందుకు వ‌చ్చిందో తెలుసా..?

1952వ సంవ‌త్స‌రంలో ముంబైలో ఓ రైల్వే ఉద్యోగికి, ఓ కత్తిపోటు బాధితుడికి తీవ్ర ర‌క్త స్రావం అవ‌డంతో వారికి ర‌క్తం అవ‌స‌రం అయింది. దీంతో వారి బ్ల‌డ్ గ్రూప్ టెస్ట్ చేశారు. అయితే డాక్ట‌ర్లు ఎంత టెస్ట్ చేసినా వారి బ్ల‌డ్ గ్రూప్ ఏమిటో క‌నిపెట్ట‌లేక‌పోయారు. దీంతో వారి ఎర్ర ర‌క్త క‌ణాల్లో ఉన్న H యాంటీ జెన్ల‌ను బ‌ట్టి అదో కొత్త ర‌క‌మైన బ్ల‌డ్ గ్రూప్ అని నిర్దారించారు. బాంబే (ఇప్పుడు ముంబై)లో ఈ బ్ల‌డ్ గ్రూప్‌ను క‌నుగొన్నారు క‌నుక దీనికి బాంబే బ్ల‌డ్ గ్రూప్ అని పేరు వ‌చ్చింది. అయితే అత్యంత అరుదైన ఈ బ్ల‌డ్ గ్రూప్ క‌లిగిన వారు విచిత్రంగా ముంబైలోనే ఎక్కువ ఉన్నార‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌రి దేశంలో ఎవ‌రికైనా ఈ గ్రూపు ర‌క్తం అవ‌స‌రం అయితే..? అంటే.. అందుకు కృషి చేస్తోంది సంక‌ల్ప్ ఇండియా ఫౌండేషన్‌. http://www.sankalpindia.net/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి బాంబే బ్ల‌డ్ గ్రూప్ అవ‌స‌రం ఉన్న‌వారు రిక్వెస్ట్ పెట్టుకోవ‌చ్చు. ఈ సంస్థే చార్జీలు భరించి ర‌క్తాన్ని ఉచితంగా స‌ర‌ఫ‌రా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..