AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evening Snacks: వేసవిలో సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్‌తో ఆరోగ్యం పదిలం.. ఇంట్లోనే లభించే వాటితోనే తయారీ..

మార్కెట్‌లో లభించే ఈ స్నాక్స్‌ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అందువల్ల స్నాక్స్‌గా ఆరోగ్యకరమైన వాటిని తినడానికి ప్రయత్నించండి. ఈ విషయాన్ని న్యూట్రిషన్ విధి చావ్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో విధి 10 ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి చెప్పింది. వీటిని తినడం వలన శరీరానికి పోషకాలు కూడా అందుతాయని.. అతిగా ఆహారం తినాలి అనే కోరిక కలగదని అంటున్నారు.

Evening Snacks: వేసవిలో సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్‌తో ఆరోగ్యం పదిలం.. ఇంట్లోనే లభించే వాటితోనే తయారీ..
Healthy Snacks
Surya Kala
|

Updated on: May 21, 2024 | 6:14 PM

Share

చాలా మంది రోజుకు మూడు సార్లు తింటారు. అంతేకాదు భోజనం తిన్న తర్వాత మధ్యమధ్యలో స్నాక్స్ తింటారు. అటువంటి పరిస్థితుల్లో చిప్స్, బిస్కెట్లు, చిప్స్ వంటి అనేక రకాల స్నాక్స్ తీసుకుంటారు. అయితే మార్కెట్‌లో లభించే ఈ స్నాక్స్‌ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అందువల్ల స్నాక్స్‌గా ఆరోగ్యకరమైన వాటిని తినడానికి ప్రయత్నించండి. ఈ విషయాన్ని న్యూట్రిషన్ విధి చావ్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో విధి 10 ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి చెప్పింది. వీటిని తినడం వలన శరీరానికి పోషకాలు కూడా అందుతాయని.. అతిగా ఆహారం తినాలి అనే కోరిక కలగదని అంటున్నారు.

సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్

ఇవి కూడా చదవండి

హమ్మస్, కీర దోస ఉడకబెట్టిన శనగలతో హమ్మస్ తయారు చేస్తారు. ఉడకబెట్టిన శనగలు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, మసాలాలు, నిమ్మరసం వేసి బాగా మెత్తగా నూరి పిండిని తయారుచేస్తారు. ఈ పిండితో రొట్టెను తయారు చేస్తారు. సాయంత్రం స్నాక్‌గా హమ్మస్ తో పాటు కీరదోసకాయతో తినవచ్చు.

దానిమ్మ , పెరుగు సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను పెరుగులో కలిపి కూడా తినవచ్చు. ఇది కడుపు నింపుతుంది. ప్రేగు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

స్నాక్స్‌గా నట్స్‌ నట్స్‌ని స్నాక్స్‌గా కూడా తినవచ్చు. నానబెట్టిన బాదం, వాల్‌నట్స్, ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు. అయితే అవసరమైన వాటికంటే ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి.

శనగలతో సలాడ్ నానబెట్టిన బెంగాల్ శనగలతో చేసిన సలాడ్‌ కూడా చిరుతిండిగా బెస్ట్ ఎంపిక. దీని కోసం ఉల్లిపాయ, కీర దోసకాయ, టొమాటో, నిమ్మకాయ, చాట్ మసాలా వేసి సలాడ్ తయారు చేసి తినవచ్చు.

స్ట్రాబెర్రీ, యోగర్ట్ పర్ఫైట్ దీన్ని చేయడానికి పెరుగును మృదువైన క్రీమ్ రూపంలో వచ్చే వరకు గిలకొట్టండి. దీని తరువాత స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలను కట్ చేసి ఆ క్రీమ్ కు జోడించండి. కావాలంటే ఇందులో రకరకల నట్స్ కూడా చేర్చుకోవచ్చు.

ఎనర్జీ బాల్ చిరుతిండిగా ఇంట్లో బెల్లం, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి వాటితో తయారు చేసిన లడ్డులను తయారు చేసి తినవచ్చు. ఈ స్వీట్ లడ్డులను తినడానికి రుచితో పాటు శక్తిని పొందుతారు.

పండ్లు నట్స్ అనేక పండ్లను కలపడం ద్వారా సలాడ్‌ను తయారు చేసి.. దీనికి మిశ్రమ మసాలా దినుసులు వేసి చిరుతిండిగా తినవచ్చు. దీని కోసం యాపిల్, మామిడి, కివీ వంటి పండ్లను ఉపయోగించవచ్చు.

మఖానా మఖానాతో తయారు చేసిన ఆహారాన్ని చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటే మంచి స్నాక్ మఖానా తో చేసిన మిక్చర్ వంటివి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..