AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ..! నోరెళ్లబెట్టి చూస్తున్న ప్రజలు..

గత నెలలో వైరల్ అయిన ఒక వీడియోలో ఇద్దరు మహిళల మధ్య బహుశా సీటు విషయంలో వాదన జరిగింది. ఈ చర్చ ఎంతగా పెరిగిపోయిందంటే అది శారీరక హింసకు కూడా దారితీసింది. వాగ్వాదం సమయంలో ఒకరు మరొకరిని నెట్టుకున్నారు. తలపై కొట్టుకోవడం,కాళ్లతో తన్నుకుంటూ నానా రచ్చ చేశారు.. వీడియోలో విచిత్రం ఏంటంటే.. పక్కనే నిలబడిన జనం వారిద్దరినీ ఆపడానికి ప్రయత్నించకపోగా, అందరూ తమ సెల్‌ఫోన్లతో వీడియో తీసుకుంటూ ఎంజాయ్‌ చేశారు.

Watch Video: మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి..  బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ..! నోరెళ్లబెట్టి చూస్తున్న ప్రజలు..
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: May 21, 2024 | 6:27 PM

Share

ఢిల్లీ మెట్రోకు స్వాగతం..ఈ మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ, మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై ఈ డైలాంగ్‌ ఎక్కడ విన్నా, చదివినా కూడా దాని వెనుక కోలాహలం సృష్టించే పోస్ట్ శీర్షిక అని మీకు ఇట్టే అర్థమైపోతుంది. దేశ రాజధాని లైఫ్ లైన్ గా చెప్పుకునే మెట్రోలో రోజురోజుకూ వింత పనులు, విచిత్ర డ్యాన్సులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెట్రో నిర్వాహణ యంత్రాంగం ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, ఎన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ ఈ ట్రెండ్ ఆగడం లేదు. ఇప్పుడు కూడా కదులుతున్న మెట్రోలో భోజ్‌పురి పాటపై ఓ అమ్మాయి వింత డ్యాన్స్ చేస్తున్న వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది. అమ్మాయి రెచ్చిపోయి డ్యాన్స్‌ చేస్తుండగా, అక్కడ కూర్చున్న వారంతా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ యువతి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు సంబంధించి DMRC ఎటువంటి ప్రకటన లేదా చర్య తీసుకోలేదు.

ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బెల్లీ డ్యాన్స్‌ చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్‌ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. వీడియోలోని మహిళ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మనిషా డాన్సర్‌గా గుర్తించారు. ఈ వీడియోని ఆమె అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మెట్రోలో ఇలాంటి వీడియోలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. గత నెలలో వైరల్ అయిన ఒక వీడియోలో ఇద్దరు మహిళల మధ్య బహుశా సీటు విషయంలో వాదన జరిగింది. ఈ చర్చ ఎంతగా పెరిగిపోయిందంటే అది శారీరక హింసకు కూడా దారితీసింది. వాగ్వాదం సమయంలో ఒకరు మరొకరిని నెట్టుకున్నారు. తలపై కొట్టుకోవడం,కాళ్లతో తన్నుకుంటూ నానా రచ్చ చేశారు.. వీడియోలో విచిత్రం ఏంటంటే.. పక్కనే నిలబడిన జనం వారిద్దరినీ ఆపడానికి ప్రయత్నించకపోగా, అందరూ తమ సెల్‌ఫోన్లతో వీడియో తీసుకుంటూ ఎంజాయ్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..