55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అమాంతం ఫ్లైఓవర్‌ పై నుంచి పల్టీ కొట్టింది.. గాల్లో ప్రాణాలు..!

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ఘటనాస్థలం నుంచి పరారైనట్టుగా తెలిసింది. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు 55 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది.

55 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అమాంతం ఫ్లైఓవర్‌ పై నుంచి పల్టీ కొట్టింది.. గాల్లో ప్రాణాలు..!
Bus Falls Off Flyover
Follow us
Jyothi Gadda

|

Updated on: May 21, 2024 | 5:34 PM

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాజ్‌గఢ్ జిల్లాలోని పచోర్ టౌన్ సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి ఫ్లైవోవర్‌పై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మే 21 మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు 55 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది.

55 మంది ప్రయాణికులతో బస్సు శివపురి జిల్లాలోని పిచోర్ పట్టణానికి వెళ్తుండగా, తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో డ్రైవర్ నియంత్రణ తప్పి ఫ్లైఓవర్ పై నుంచి పడిపోయిందని పచోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆకాంక్ష శర్మ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. సుమారు 40 మంది గాయపడ్డట్లు వెల్లడించారు. మృతుల్లో ఒకరిని హర్జత్ సింగ్ (28)గా గుర్తించారు. మరొకరిని గుర్తించలేదు. గాయపడిన వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను ఇండోర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన వారు షాజాపూర్, బయోరా, పచోర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ఘటనాస్థలం నుంచి పరారైనట్టుగా తెలిసింది. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..