AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : ఇలా వెళితే నేరుగా యమపురికే.. ! కిక్కిరిసిన రైలులో ఇలా.. వీడియో చూస్తే గుండె గుభేల్‌

ఇటీవల రద్దీ రైళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావటం కూడా మనం చూశాం. గతంలో ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. అందులో చూస్తే ఆ ట్రైన్‌లో కనీసం బాత్‌రూంకు కూడా వెళ్లకుండా ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఎంట్రీ, ఎగ్జీట్‌ డోర్ల వద్ద కూడా ప్రయాణికులు నిల్చుని ఉన్నారు. అలాంటిదే ఇప్పుడు మరో వీడియోలో వైరల్‌ అవుతోంది.

Indian Railways : ఇలా వెళితే నేరుగా యమపురికే.. ! కిక్కిరిసిన రైలులో ఇలా.. వీడియో చూస్తే గుండె గుభేల్‌
Overcrowded Train
Jyothi Gadda
|

Updated on: May 21, 2024 | 3:29 PM

Share

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ భారతీయు రైల్వే వ్యవస్థ. దేశంలో ప్రతిరోజూ లక్షల మందిని రైల్వేలు గమ్య స్థానానికి చేరవేస్తున్నాయి. ఎక్కు దూరం ప్రయాణించడానికి దేశంలో ఎక్కువ మంది ఉపయోగించేది రైళ్లేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. భారత రైల్వేల్లో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. తరచూ ఈ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా పండగలు, సెలవుల నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇటీవల రద్దీ రైళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావటం కూడా మనం చూశాం. గతంలో ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. అందులో చూస్తే ఆ ట్రైన్‌లో కనీసం బాత్‌రూంకు కూడా వెళ్లకుండా ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఎంట్రీ, ఎగ్జీట్‌ డోర్ల వద్ద కూడా ప్రయాణికులు నిల్చుని ఉన్నారు. అలాంటిదే ఇప్పుడు మరో వీడియోలో వైరల్‌ అవుతోంది.

ఇప్పుడు వైరల్‌ అవుతున్న రైలు రద్దీకి సంబంధించిన వీడియో మరింత దారుణంగా ఉంది. రైలు ఎక్కేందుకు జనాలు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తున్నారు. ఇక్కడ ఆడ, మగ అనే తేడా లేకుండా రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఆడవారికి సాయం చేస్తూ.. ఆ తర్వాత మగవారు ఆ రైలు ఎక్కుతున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ షాక్‌ అయ్యేలా కనిపించింది. ఎందుకంటే.. ఆ రైల్లో కనీసం ఒక్క కాలు మోపేందుకు కూడా స్థలం ఖాళీగా లేదు. అలాంటి రైల్లోకి మహిళను ఎలాగోలా లోపలికి తోస్తాడు. తరువాత అతను రైలు చివరి మెట్టుపై నిలబడి ఒక బరువైన లగేజీ బ్యాగ్‌తో వేలాడుతూ ప్రయాణిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన రైలు డోర్ బయట వేలాడుతున్న వ్యక్తుల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూస్తుంటే.. నిజంగానే ఒక్క క్షణం గుండెల్లో వణుకు పుట్టించేలా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో దీనిపై స్పందించారు. దయచేసి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు .

ఈ వీడియో మే 20న Instagram ఖాతా @IndianTechGuide లో షేర్ చేయబడింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2.5 మిలియన్లు లేదా 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో సర్వత్రా వైరల్ అవుతుండటంతో పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..