Flamingos Killed: దారుణం.. ఆకాశంలో యాక్సిడెంట్‌.. 40 ఫ్లెమింగోలు మృతి.. అసలేం జరిగిందంటే..

మరోవైపు అటవీ శాఖ అధికారులు ఘట్‌కోపర్‌ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న పక్షుల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు కళేబరాలను శవపరీక్ష కోసం పంపినట్లు రెస్కింక్‌ అసోసియేషన్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ వెల్ఫేర్‌ వ్యవస్థాపకుడు పవన్‌ శర్మ తెలిపారు.

Flamingos Killed: దారుణం.. ఆకాశంలో యాక్సిడెంట్‌.. 40 ఫ్లెమింగోలు మృతి.. అసలేం జరిగిందంటే..
Flamingos Found Dead In Mumbai
Follow us
Jyothi Gadda

|

Updated on: May 21, 2024 | 2:45 PM

ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులు అనుకోని ఆక్సిడెంట్‌తో మృత్యువాత పడ్డాయి. అవును, ఎమిరేట్స్‌ విమానం ఢీ కొని సుమారు 40 ఫ్లెమింగోలు మరణించాయి. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఘట్‌కోపర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ముంబైలో వీటిని రాజహంసలుగా పిలుస్తారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 9:18 గంటల సమయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఎమిరేట్స్ ఈకే 508 విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు పక్షులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 40 ఫ్లెమింగోలు మరణించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎటు చూసినా పక్షుల మృతదేహాలతో నిండిపోయింది. విరిగిన ఈకలు, గోళ్లు, ముక్కులు చెల్లాచెదురుగా పడివున్నాయి.

ఈ ఘటనలో విమానం కూడా కొంతమేర దెబ్బతిన్నట్లు తెలిపారు. ఘటన నేపథ్యంలో రిటర్న్‌ ఫ్లైట్‌ను అధికారులు రద్దు చేశారు. అయితే, విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరోవైపు అటవీ శాఖ అధికారులు ఘట్‌కోపర్‌ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న పక్షుల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు కళేబరాలను శవపరీక్ష కోసం పంపినట్లు రెస్కింక్‌ అసోసియేషన్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ వెల్ఫేర్‌ వ్యవస్థాపకుడు పవన్‌ శర్మ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..