Watch Video: వామ్మో ఇదేం ఫోన్ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా… చూస్తే అవాక్కే..!!
ఈ వీడియో కిరణ్ సరన్77 యొక్క X ఖాతా నుండి షేర్ చేయబడింది. ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ బట్టలు ఉతకటం కనిపిస్తుంది. అయితే, ఆమె లాండ్రీ చేస్తూ కూడా తన మొబైల్‌ను చూడాలనుకుంటుంది. అందుకోసం ఆమె కొత్త ట్రిక్‌ను కనిపెట్టింది. ఆమె చేసిన పని చూస్తే నవ్వు ఆపుకోవటం కష్టమే అవుతుంది.
మనిషికి ఆహారం, దుస్తులు, నివాసం ప్రాథమిక అవసరాలు. కానీ, ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా ప్రతిఒక్కరికీ అత్యవసరంగా మారింది. నేడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. రెండు నిమిషాలు కూడా మొబైల్ లేకుండా ఉండడం కష్టంగా మారిపోయింది పరిస్థితి. సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించడం, రీల్స్‌కు విపరీతంగా అలవాటు పడటమే ఇందుకు కారణం. సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉన్నాయి. మరికొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉంటున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ అపూర్వ ట్రిక్ ప్లే చేసింది. పని చేస్తున్నప్పుడు తన ఫోన్‌ను ఉపయోగించగలిగేలా ఆమె చేసిన పనిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వీడియో కిరణ్ సరన్77 యొక్క X ఖాతా నుండి షేర్ చేయబడింది. ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ బట్టలు ఉతకటం కనిపిస్తుంది. అయితే, ఆమె లాండ్రీ చేస్తూ కూడా తన మొబైల్‌ను చూడాలనుకుంటుంది. అందుకోసం ఆమె కొత్త ట్రిక్‌ను కనిపెట్టింది. ఆమె చేసిన పని చూస్తే నవ్వు ఆపుకోవటం కష్టమే అవుతుంది. ఎందుకంటే, మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉండలేని ఆ మహిళ తలకు రుమాలు కట్టి, రుమాలులో మందపాటి పొడవాటి కర్రను కట్టింది. కళ్ల ముందు వరకు వచ్చేలా కర్రకు ప్లాస్టిక్ కవర్ కట్టి అందులో ఫోన్ వేసుకుంది. పని చేస్తూ ఆమె తన చేతులు ఉపయోగించకుండా ఫోన్ వైపు చూస్తూ బట్టలు ఉతికే పనిచేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు ఆన్సర్ చేస్తుంది. ఫోన్ ప్లాస్టిక్ కవర్‌లో వేసి వాడుతున్నందున నీళ్లు తగులుతాయనే భయం కూడా లేదు. మీరు ఈ ట్రిక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
रील के चक्कर में क्या क्या करना पड़ता है 🙊😂 pic.twitter.com/J1vKu5Hn2g
— Kiran Saran77 (@Kiran_Saran77) May 19, 2024
ఈ వీడియో వినోదం కోసం ఉద్దేశించబడినప్పటికీ, సోషల్ మీడియా మితిమీరిన వినియోగం గురించి ఆలోచించేలా చేస్తుంది. ఇకపోతే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..