Photo puzzle: మీ ఐక్యూకి ఓ టెస్ట్.. ఈ ఫొటోలో హంతకుడిని కనిపెట్టగలరా.? క్లూ ఇందులోనే ఉంది
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు రీల్స్‌లో కూడా కొందరు వీటిని రూపొందిస్తూ మంచి వ్యూస్ పొందుతున్నారు. ఇలాంటి ఫొటో పజిల్స్ హంతకులను గుర్తించే పజిల్స్ కూడా ఒకటి. ప్రస్తుతం ఇలాంటి పజిల్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో పజిల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు...
ఫొటో పజిల్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. వీటిని సాల్వ్ చేసే క్రమంలో మంచి కిక్కునిస్తాయి. ఒకప్పుడు ఇలాంటి ఫొటో పజిల్స్ సండే మ్యాగజైన్ లాంటి వాటిలో మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నెట్టింట కూడా ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు రీల్స్‌లో కూడా కొందరు వీటిని రూపొందిస్తూ మంచి వ్యూస్ పొందుతున్నారు. ఇలాంటి ఫొటో పజిల్స్ హంతకులను గుర్తించే పజిల్స్ కూడా ఒకటి. ప్రస్తుతం ఇలాంటి పజిల్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో పజిల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పైన ఫొటోలో ఒక రెస్టరంట్‌లో పలువురు ఉన్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే అదే రెస్టరంట్‌లోని బాత్‌రూమ్‌లో ఒక మహిళ హత్యకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది కదూ. అయితే రెస్టారెంట్ లోపల ఉన్న 5గురిల్లో ఆ మహిళను చంపిన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో గుర్తించడమే ఆ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇందుకోసం ఈ ఫొటోలోనే కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి. వాటి ఆధారంగా హంతకుడిని గుర్తించాలి. జాగ్రత్తగా గమనిస్తే ఆ హంతకుడిని కనిపెట్టవచ్చు.
ఇంతకీ మీరు ఆ హంతకుడిని గుర్తించారా.? లేదంటే సమాధానం కోసం కింద చూడండి..అందులో ఉన్న 4వ నెంబర్ వ్యక్తే సదరు హంతకుడు. ఇంతకీ అతనే హంతకుడని ఎలా చెప్తున్నారనేగా మీ సందేహం. ఆ వ్యక్తి మెడపై కాటును గమనించవచ్చు. యువతిని చంపే సమయంలో జరిగిన గొడవలో మెడపై గాటు పడింది. అలాగే హత్యకు గురైన ఆ మహిళ చేతిలో ఈ వ్యక్తి చొక్కాకు సంబంధించి క్లాత్ కనిపిస్తోంది. ఈ క్లూస్ ఆధారంగా మహిళను చంపిన వ్యక్తి అతడేనని కాన్ఫామ్ చేయొచ్చు.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..