Degree Student: ‘చీర కట్టి, అమ్మాయిలా ముస్తాబు చేసుకుని..’ హాస్టల్ గదిలో డిగ్రీ విద్యార్ధి అనుమానాస్పద మృతి!
పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్ధి అనుమానాస్పద రీతిలో హాస్టల్ గదిలో మృతి చెందికనిపించాడు. విద్యార్ధి శరీరంపై చీర ధరించి ఉండటంతోపాటు ముఖానికి అమ్మాయిల మేకప్, కళ్లకు గంతలు కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. పైగా మృతుడి గదిలో రక్తపు మరకలు ఇది ఖచ్చితంగా హత్యేననే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. పథకం ప్రకారం విద్యార్ధిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు..
ఇండోర్, మే 21: పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్ధి అనుమానాస్పద రీతిలో హాస్టల్ గదిలో మృతి చెందికనిపించాడు. విద్యార్ధి శరీరంపై చీర ధరించి ఉండటంతోపాటు ముఖానికి అమ్మాయిల మేకప్, కళ్లకు గంతలు కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. పైగా మృతుడి గదిలో రక్తపు మరకలు ఇది ఖచ్చితంగా హత్యేననే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. పథకం ప్రకారం విద్యార్ధిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్‌కి చెందిన పునీత్ దూబే (21) B.Sc అనే విద్యార్ధి ఇండోర్‌లోని రంజిత్ సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత గది నుంచి దుర్వాసన రావడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించిన పునీత్ వేషధారణ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. చీర ధరించి, మహిళల అలంకరణలో కనిపించాడు. పైగా పునీత్ కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహానికి సమీపంలో నేలపై కూడా రక్తపు మడుగు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పునీత్‌ది మృతి ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పునీత్ తండ్రి త్రిభువన్ దూబే రైతు నాయకుడు.. ఉదయపురా నివాసి. ఆయన మాట్లాడుతూ తన కొడుకు చదువు కోసం రెండేళ్ల క్రితం ఇండోర్‌కు వచ్చాడని, కంప్యూటర్ సైన్స్ B.Sc రెండవ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. రోజూ రాత్రి ఇంటికి ఫోన్ చేసేవాడని,గురువారం రాత్రి 10 గంటలకు తన తల్లి విభూతి దూబేతో పునీత్ చివరిసారిగా మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం సెలవులు కావడంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కోచింగ్ సెంటర్‌లో క్లాస్‌లకు హాజరయ్యేవాడని పునీత్ తండ్రి త్రిభువన్ పోలీసులకు తెలిపాడు. పునీత్ ఫోన్ శుక్రవారం అంతా స్విచ్ఛాఫ్ వచ్చిందని అన్నారు. దీంతో పునీత్ స్నేహితులకు ఫోన్ చేయగా.. వారు పునీత్ గది లోపలి నుంచి గడి పెట్టిఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా పునీత్ మృతదేహం కనిపించింది.
పునీత్ ల్యాప్‌టాప్, మొబైల్‌తోపాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పునీత్ హాస్టల్ రూమ్‌మేట్స్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పునీత్ దూబేకి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత, అతడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని త్రిభువన్ దూబే డిమాండ్ చేశారు. పునీత్ మృతికి ర్యాగింగ్ కారణమా.. లేదా మరేదైనా జరిగి ఉంటుందా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.