Viral Video: ప్రియుడితో షికారుకెళ్లాలనుకున్న యువతి.. కట్ చేస్తే.. ఆ తర్వాత ఇది సీన్

ఓ యువతి తన ప్రియుడ్ని జాలీగా బయట షికారుకు తీసుకెళ్లాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా స్కూటీపై అతడి ఇంటి ముందుకు వచ్చి వాలింది. అతడికి ఫోన్ చేసి.. బయటకి రమ్మని పిలిచింది. ఇక ఆ తర్వాత జరిగిన సీన్ మాములుగా ఉండదు. వేరే లెవెల్. ఇందుకు సంబంధించిన వీడియో..

Viral Video: ప్రియుడితో షికారుకెళ్లాలనుకున్న యువతి.. కట్ చేస్తే.. ఆ తర్వాత ఇది సీన్
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 21, 2024 | 5:41 PM

ఓ యువతి తన ప్రియుడ్ని జాలీగా బయట షికారుకు తీసుకెళ్లాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా స్కూటీపై అతడి ఇంటి ముందుకు వచ్చి వాలింది. అతడికి ఫోన్ చేసి.. బయటకి రమ్మని పిలిచింది. ఇక ఆ తర్వాత జరిగిన సీన్ మాములుగా ఉండదు. వేరే లెవెల్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగింది.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ వీడియో ప్రకారం.. అందులో కనిపిస్తున్న యువతి.. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి షికారుకు వెళ్దామని అనుకుంది. ఆ క్రమంలోనే అతడి ఇంటికి వచ్చింది. ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిచింది. ఇక ఇక్కడే వారి ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. బయటకు తన ప్రియుడు వస్తాడు అనుకుంటే.. అతడి తల్లి వచ్చింది. ఆమె సైలెంట్‌గా వచ్చి.. యువతి జుట్టు పట్టుకుంది. సదరు యువతితో వాగ్వాదానికి దిగింది. తన కొడుకుతో నీకేంటి పని అంటూ కొట్లాటకు దిగడమే కాకుండా.. యువతి స్కూటీకి ఉన్న కీ లాగేసింది. దీంతో షాకైన సదరు యువతి.. అక్కడికి ఎవరి కోసమో రాలేదని.. పని మీద వచ్చానని చెప్పింది. అయినా వినకుండా ఆ మహిళ.. ఆమెపై దాడికి దిగుతూ.. చెడామడా తిట్టేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి.