Kurumurthy Swamy: పేదల తిరుపతి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు.. పాదుకలతో కొట్టించుకోవడానికి పోటెత్తిన భక్తులు
స్వామి వారి పాదుకలను ఊరేగింపుగా కురుమూర్తి కొండ వద్దకు తీసుకువచ్చారు. దీంతో కురుమూర్తి జాతర ప్రారంభమైంది. కొండ వద్దకు చేరుకున్న పాదుకలకు స్థానిక ఎంఎల్ఎ ఆల వెంకటేశ్వరరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ స్వర్ణసుధాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పేదల తిరుపతి గా పిలువబడే అమ్మాపురం గ్రామ సమీపంలో గల కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతరకు భారీగా జనం తరలి వచ్చారు. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలుత వడ్డేమాన్ నుంచి ఉద్దానం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారి పాదుకలను ఊరేగింపుగా కురుమూర్తి కొండ వద్దకు తీసుకువచ్చారు. దీంతో కురుమూర్తి జాతర ప్రారంభమైంది. కొండ వద్దకు చేరుకున్న పాదుకలకు స్థానిక ఎంఎల్ఎ ఆల వెంకటేశ్వరరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ స్వర్ణసుధాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారి పాదుకలను కొండపైకి భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లారు. జాతర సందర్భంగా ఆ ప్రాంగణంలో వేలాది దుకాణాలు వెలిశాయి. ఈ సారి లక్షకు పైగా భక్తులు పాల్గొన్నారని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని…కురుమూర్తి స్వామి ఆశీస్సులతో పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయిందని అన్నారు ఎంఎల్ఎ ఆల వెంకటేశ్వరెడ్డి.
చారిత్రక ఆధారాల ప్రకారం కురుమూర్తి స్వామి ఆలయం సుమారు 1350 ప్రాంతంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని శ్రీరామ్ భూపాల్ నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ ముక్కర కులస్తులు ఆలయాన్ని పర్యవేక్షిస్తూ ఆలయ అభివృద్ధిని సమీక్షిస్తున్నారు. ఆ వంశీయులు చేయించిన ఆభరణాలనే నేటీకీ స్వామివారికి బ్రహ్మోత్సవాలలో అలంకరించారు. ఈ కురుమూర్తి బ్రహ్మోత్సవంలో ఉద్దాలోత్సవం ప్రధాన ఘట్టంగా చెబుతారు. “ఉద్దాల ఉత్సవం: అంటే పాదుకల తయారీ ప్రధాన ఘట్టం. ఈ పాదుకలను వడ్డెమాన్ గ్రామం నుంచి స్వామివారి కోసం కొండమీదకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ముఖ్యంగా ఆవు చర్మంతో చేసిన శివుని పాదాలను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో పోటెత్తారు. ఈ పాదుకలతో భక్తులు తలపై, వీపుపై కొట్టుకుంటే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.
“ఉద్దాల ఉత్సవం” అంటే పాదుకల తయారీ ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెప్పించిన ఆవు చర్మంతో వడ్డెమాన్ గ్రామంలోని చర్మకారులు వారం రోజుల పాటు కష్టపడి ఈ పాదుకలను తయారు చేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయస్వామి ఆలయంలో పూజించి కొండ దిగువన స్వాగతం పలికి కాంచన గుహలోని కురుమూర్తి సన్నిధికి తీసుకెళ్లి ఉద్దాల మండపంలో స్వామివారికి అలంకరిస్తారు. ఈ ఉద్దాల పండుగకు లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు హాజరవుతారు.
జాతర ఏర్పాట్ల ప్రభుత్వం నిధులను ఇచ్చింది. అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ నుండి పారిశుద్ధ సిబ్బందితోపాటు, జిల్లాలోని మూడు మున్సిపాలిటీల నుండి కూడా పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:
Minister KTR: బీజేపీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు