AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spiritual News: ఇంట్లో పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?

Spiritual News: హిందూమతంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది ఉంటుంది. అందరు ఆ గదిలో భగవంతుడిని ధ్యానిస్తారు.

Spiritual News: ఇంట్లో పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?
Astro Tips
uppula Raju
|

Updated on: Jan 31, 2022 | 3:37 PM

Share

Spiritual News: హిందూమతంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది ఉంటుంది. అందరు ఆ గదిలో భగవంతుడిని ధ్యానిస్తారు. ప్రశాంతంగా దేవుడిని పూజిస్తారు. భక్తులు తమ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాలుగా పూజలు చేస్తారు. అయినా కానీ మీ మనస్సు కలవరపడటం, పూజ సమయంలో మనస్సు ఎక్కడెక్కడో సంచరించడం జరుగుతుంది. ఎన్నిసార్లు పూజలు చేసినా సరైన ఫలితాలు లభించవు. దీనికి కారణం పూజ సమయంలో చేసే పొరపాట్లు. అందుకే ఇంట్లో పూజ చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. దిశను జాగ్రత్తగా చూసుకోండి

మీ ఇంట్లో పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశ దేవుని ఆలయానికి అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఒకవేళ నైరుతి దిశలో ఉంటే పూజ ఫలాలు తక్కువగా ఉంటాయి.

2. పూజ చేసేటప్పుడు మీ ముఖం ఇలా ఉండాలి..

పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడు మీ ముఖం పడమర వైపు ఉండాలి. దేవుని ముఖం తూర్పు వైపు ఉండాలని గుర్తుంచుకోండి. అంతే కాదు దేవతా విగ్రహం ముందు ఎప్పుడూ వెన్నుచూపి కూర్చోకూడదు.

3. ఆసన భంగిమలో కూర్చోవాలి

తరచుగా ప్రజలు నేలపై కూర్చుని పూజలు చేస్తారు. కానీ ఇది సరైన పూజ పద్ధతి కాదు. పూజ సమయంలో ఆసనాలను ఉపయోగించడం అవసరం. ఆసనంపై కూర్చోకుండా పూజిస్తే దరిద్రమని చెబుతారు. కాబట్టి పూజ చేసేటప్పుడు మంచి ఆసన భంగిమలో కూర్చోవాలి.

4. గుడిలో దీపం వెలిగించండి

ఇంట్లో పూజగది ఉంటే ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఇంట్లో దీపాలు వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది.

5. పంచదేవుళ్లని పూజించాలి

విష్ణువు, గణేశుడు, మహాదేవుడు, సూర్య దేవ్, దుర్గాదేవిలను పంచదేవులు అంటారు. వీరిని పూజించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఈ విషయాల పట్ల అప్రమత్తత అవసరం..?

బచ్చలికూరలో అద్భుత పోషకాలు.. ఎముకల ధృడత్వానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి సూపర్..

Viral Photos: 2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు..?