AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinna Jeeyar Swamy: కరోనాకు మించిన వ్యాధి నేడు సమాజాన్ని పట్టి పీడిస్తోంది.. చిన్నజీయర్ స్వామి

 Chinna Jeeyar Swamy: ప్రస్తుత సమాజానికి సమతా స్పూర్తి బోధనలు ఎంతో అవసరమన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి (Chinna Jeeyar Swamy). ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు శ్రీరామానుజ(sri ramanuja)..

Chinna Jeeyar Swamy: కరోనాకు మించిన వ్యాధి నేడు సమాజాన్ని పట్టి పీడిస్తోంది.. చిన్నజీయర్ స్వామి
Chinna Jeeyar Swamy
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 01, 2022 | 5:17 PM

Share

 Chinna Jeeyar Swamy: ప్రస్తుత సమాజానికి సమతా స్పూర్తి బోధనలు ఎంతో అవసరమన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి (Chinna Jeeyar Swamy). ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు శ్రీరామానుజ(sri ramanuja) సహస్రాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వైరస్‌..అసమానతను పొగొట్టేందుకే ఈ ప్రయత్నమన్నారు చినజీయర్‌స్వామి. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది శ్రీ రామానుజాచార్యుల వారన్నారు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి. రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగను ఫిబ్రవరి 2 నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. కరోనా నిర్మూలన కోసం 1035 కుండాల యాగం నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో అసమానతలు పెరిగిపోయాయని స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి అంతరంగంలో అహంకారం అనే జబ్బును నయం చేసేందుకు సమతా స్పూర్తి అనే మందును వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు కనిపెట్టారని జీయర్ స్వామి తెలిపారు.

సమాజంలో అనేక రకాల విశ్వాసాలు ఉంటాయన్నారు చినజీయర్‌స్వామి. అయినా ఒక్క సమాజంగా మానవుడు బతకుతున్నారన్నారు. మనుషులపై ఆధిపత్యం ప్రదర్శించే స్థితిని ప్రస్తుత రోజుల్లో చూస్తున్నామన్నారు. ఇదే అంతరంగిక రోగమని..మనిషిలోని అహంకారమే దీనికి కారణమన్నారు. బయట వచ్చే రోగాలకే కాదు, అంతరంగికమైన జబ్బులకు కూడా మందులను కనుక్కోవాలన్నారు. మనిషిలోని అహంకారానికి మందును రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే కనిపెట్టారని జీయర్ స్వామి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమతా స్పూర్తే మనిషిలోని అహంకారాన్ని తుదముట్టిస్తుందని రామానుజాచార్యులు చెప్పారని జీయర్ స్వామి తెలిపారు.

మన దేశం, ధర్మం, సంస్కృతిపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు చినజీయర్‌ స్వామి. పూర్వీకుల వైభవాన్ని మరిచిపోయామని…తిరిగి గుర్తుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానవసేవయే..మాధవసేవ కాదని…మాధవసేవయే..సర్వప్రాణుల సేవ అన్నారు జీయర్‌స్వామి. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్త్రీలకు ఉన్న సాధికారతను మన వేదాలు గుర్తించాయని..ఇది భారతీయ ఆత్మ అన్నారు. మహిళలకు అగ్రాధిపత్యం ఇవ్వాలనే పద్దతిని రామానుజాచార్యులు రూపుదిద్దారన్నారు.

శరీరంలోని అన్ని అవయవాలు కలిసి పనిచేసినట్టుగానే సమాజంలో అందరికి సమాన అవకాశాలు ఉండాలన్నదే సమతా స్పూర్తి ఉద్దేశ్యమని చినజీయర్‌ చెప్పారు. ప్రతి వ్యక్తి భగవంతుడి సంతానమేనన్నారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాల ప్రతిరూపాలను ఏర్పాటు చేశామన్నారు త్రిదండి చినజీయర్‌స్వామి.

Also Read :

ఇంట్లో పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?