Chanakya Niti: కొత్త వ్యాపారంలో సక్సెస్ అందుకోవాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ ముఖ్యమైన విషయాలను పాటించండి..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Chanukya) బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి . తన అనుభవాల ఆధారంగా మనిషి జీవించే విధానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అవి నేటి జనరేషన్ కు అనుసరణీయం..

Chanakya Niti:  కొత్త వ్యాపారంలో సక్సెస్ అందుకోవాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ ముఖ్యమైన విషయాలను పాటించండి..
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2022 | 7:22 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Chanukya) బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి . తన అనుభవాల ఆధారంగా మనిషి జీవించే విధానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అవి నేటి జనరేషన్ కు అనుసరణీయం. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి (Chanakya Niti) పుస్తకంలో అలాంటి కొన్ని అలవాట్లను పేర్కొన్నాడు, ఒక వ్యక్తి చెడు అలవాట్లు కలిగి ఉంటే.. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందలేడు. అంతేకాదు ఓ వ్యక్తి జీవితంలో విజయం సొంతం చేసుకోవాలన్నా..  విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా మారాలో కూడా సూచించాడు. ఈరోజు ఆ సూత్రాలు ఏమిటో చూద్దాం..

* ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు.. వ్యక్తి తన ఆలోచనలను స్థిరంగా,సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతికూల ఆలోచనలతో ఎక్కువ దూరం వెళ్లలేరని. అందుకనే ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించాలని ఆచార్య చాణక్యుడు సూచించారు.

*ఏదైనా పనిని ప్రారంభించబోయే సమయంలో అది మీరు చేయగలరా లేదా అని ఆలోచించాలి.. అంతేకాదు.. ఒకవేళ ఆ పనిని సరిగ్గా చేయలేకపోతే.. మరొక ప్రత్యామ్నాయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని అప్పుడే విజయాన్ని సొంతం చేసుకుంటారని చెప్పాడు.

*కొత్త పనిని ప్రారంభించేటప్పుడు.. ఆ వ్యాపారవేత్త తన ప్రసంగంపై నియంత్రణ కలిగి ఉండాలని చాణక్యుడు సూచించాడు. చులకనగా, ఇష్టారీతిన మాట్లాడితే అప్పుడు వ్యాపారం నష్టానికి దారి తీస్తుంది. అంతేకాదు చాణక్య నీతి ప్రకారం.. ఎవరైనా కొత్త పనిని ప్రారంభించే సమయంలో బయటి వ్యక్తికి ఆ విషయాన్ని తెలియజేయవద్దు. మీ ఆలోచనలను మీలో ఉంచుకోండి.

*చాణక్య నీతి ప్రకారం.. వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి కొన్ని కఠినమైన, అనిశ్చిత నిర్ణయాలు కూడా తీసుకోవలసి ఉంటుంది. రిస్క్‌ తీసుకుంటే తప్ప విజయం సాధించలేరు. పనిని ప్రారంభించే ముందు, సమయం, స్థలం, ఈ పనిలో భాగస్వాములు ఎవరు మీకు ఎవరు సహాయం చేయగలరో తప్పని సరిగా తెలుసుకోవాల్సి ఉంది.

Also Read:

కరోనాకు మించిన వ్యాధి నేడు సమాజాన్ని పట్టి పీడిస్తోంది.. చిన్నజీయర్ స్వామి