Surya Arghya Niyam: సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇలా సమర్పిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే..

Surya Arghya Niyam: హిందూ మతం(Hindu Religion)లో సూర్య భగవానుడి (Lord Sun) ఆరాధనకు ప్రత్యేకస్థానం ఉంది.  ఇవ్వబడింది. సృష్టిలో కాంతికి, శక్తికి మూలం సూర్య దేవుడు. అందుకనే సూర్యడిని..

Surya Arghya Niyam: సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇలా సమర్పిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే..
Surya Arghya Niyam
Follow us

|

Updated on: Jan 31, 2022 | 9:27 PM

Surya Arghya Niyam: హిందూ మతం(Hindu Religion)లో సూర్య భగవానుడి (Lord Sun) ఆరాధనకు ప్రత్యేకస్థానం ఉంది.  ఇవ్వబడింది. సృష్టిలో కాంతికి, శక్తికి మూలం సూర్య దేవుడు. అందుకనే సూర్యడిని ఆది దేవుడిగా భావిస్తారు ఆరోగ్యం ప్రదాతగా భావించి పూజిస్తారు. ప్రతి రోజూ ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతోనే దినచర్య ప్రారంభించడం వలన అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. జాతకంలో సూర్య స్థానం బలహీనంగా ఉన్నా.. వ్యక్తి జీవితంలో ఇబ్బందులు పడుతున్నా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడంతో అన్ని కష్టాలు తీరిపోతాయని  అనేక  గ్రంధాలలో చెప్పారు. అవును, మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినప్పుడల్లా, కొన్ని ప్రత్యేక విషయాలను..  ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.  ఈ నియమాలను పాటిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే…  లక్ష్మి దేవి అనుగ్రహం మీ పైనే ఉంటుంది. అయితే సూర్యభగవానునికి అర్ఘ్యం అర్పించడంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.. అవి ఏమిటో తెలుసుకుందాం..

1 సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించేవారు ఎప్పుడూ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన, ఉతికిన బట్టలు ధరించాలి. అనంతరం సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పిస్తే జీవితంలో డబ్బుకు ఇబ్బంది ఉండదని చెబుతారు.

2  సాధ్యమైనంత వరకు.. ఎల్లప్పుడూ ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఈ సమయంలో అర్ఘ్యం ఇవ్వడం  విశేష ఫలితాలను ఇస్తుంది.

3 సూర్యభగవానుడికి నీటిని  అర్ఘ్యం గా సమర్పించిన అనంతరం తప్పనిసరిగా మూడుసార్లు ప్రదక్షిణలు చేసి, ఆపై భూమి పాదాలను తాకి, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.

4 సూర్యునికి అర్ఘ్యం అర్పిస్తున్నప్పుడు, మీ రెండు చేతులను తలపై ఉంచుకోవాలి. అంతే కాదు సూర్యభగవానునికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడం వలన నవగ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుంది.

5 ఎరుపు రంగు బట్టలు ధరించి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడం పవిత్రంగా భావిస్తారు. అంతే కాదు, అర్ఘ్యం సమర్పించిన అనంతరం ధూపం, అగరబత్తీలు మొదలైన వాటితో దేవుడిని పూజించాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించే ముందు ఆ నీటిలో ఎర్ర చందనం , ఎర్రటి పువ్వులు వేయాలి.

6 ఎల్లప్పుడూ ఉదయం సూర్యునికి నీటిని అర్ఘ్యం ఇవ్వడం వలన మంచి ఫలితం వస్తుందని నమ్మకం. సూర్యుడి దర్శనం కలగకపోతే.. సూర్యభగవానుడిని తలచుకుంటూ.. ఓం ఆదిత్య నమః లేదా ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. అంతేకాదు అర్ఘ్యం సమర్పించే సమయంలో మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. సూర్యుడు తూర్పు దిశలో కనిపించని సమయంలో కూడా అదే దిశలో నీరు అర్ఘ్యం ఇవ్వాలి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసం, నమ్మకం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

 కొత్త వ్యాపారంలో సక్సెస్ అందుకోవాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ ముఖ్యమైన విషయాలను పాటించండి..

దారుణంగా పడిపోయిన టమాటా ధర.. అక్కడ మార్కెట్లో కిలో రూ.5 లే.. గగ్గోలు పెడుతున్న రైతన్న..