Vastu Tips: వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఈ 5 వాస్తు చిట్కాలు తెలుసుకోండి..?
Vastu Tips: వాస్తు సూత్రాలు ఇంటివరకే పరిమితం కాదు. వ్యాపార రంగాలలో పాటిస్తే అభివృద్ధి జరుగుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఆఫీసులో, ఫ్యాక్టరీలో లేదా దుకాణంలో
Vastu Tips: వాస్తు సూత్రాలు ఇంటివరకే పరిమితం కాదు. వ్యాపార రంగాలలో పాటిస్తే అభివృద్ధి జరుగుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఆఫీసులో, ఫ్యాక్టరీలో లేదా దుకాణంలో వాస్తు సూత్రాలను అమలు చేయాలి. వాస్తు ప్రకారం.. ఇల్లు, కార్యాలయం, దుకాణం, ఫ్యాక్టరీ గదులను నిర్వహించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని పట్టించుకోకపోవడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడుతాయి. ఇది జీవితంలోనే కాకుండా వ్యాపారంలో కూడా ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వాస్తు దోషం వల్ల వ్యాపారంలో నష్టం వాటిల్లుతుంది. వాస్తు నియమాలను అనుసరించడం ద్వారా లోపాలు దూరంగా ఉండటమే కాకుండా వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. అంతే కాదు ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాంటి కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.
1. వ్యాపారంలో పురోగతిని సాధించడంలో ప్రధాన ద్వారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. షాప్ లేదా షోరూమ్ మెయిన్ డోర్ ఎప్పుడూ మధ్యలో ఉండాలని చెబుతారు. మీరు కూడా మీ మెయిన్ డోర్‌ని కార్నర్‌కి బదులుగా మధ్యలో ఏర్పాటు చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి.
2. మీరు దుకాణదారు అయితే దుకాణంలో వస్తువుల కోసం తయారు చేసిన షెల్ఫ్ లేదా అల్మారా దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాస్తు ప్రకారం దుకాణంలో షెల్ఫ్ లేదా అల్మారా ఎల్లప్పుడూ వాయువ్య దిశలో ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు లాభంతోపాటు వ్యాపారంలో కలిసి వస్తుంది.
3. వ్యాపార స్థలంలో దేవుడి స్థలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పూజగది ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉంచాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
4. దుకాణం లేదా వ్యాపార స్థలంలో గోడల రంగు కూడా ముఖ్యమే. షాప్ లేదా ఆఫీసులో లేత రంగులు వేయాలి. దీని వల్ల వ్యాపార స్థలంలో సానుకూలత ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అతను పనిలో ఎక్కువ ఏకాగ్రతతో ఉండగలడు.
5. వ్యాపారంలో పురోగతి కోసం కార్యాలయంలో పాంచజన్య శంఖాన్ని అమర్చవచ్చు. శంఖాన్ని పూజించడం ద్వారా సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి సంతోషపడుతుంది. వ్యాపారంలో ఆమె అనుగ్రహం లభిస్తుంది.
ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.