Kieron Pollard: ఇంగ్లాండ్‌ని ఓడించాక కీరన్ పొలార్డ్ భారత్ గురించి కీలక ప్రకటన చేశాడు..?
Kieron Pollard: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు అహ్మదాబాద్ చేరుకోగా వెస్టిండీస్
Kieron Pollard: ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు అహ్మదాబాద్ చేరుకోగా వెస్టిండీస్ జట్టు త్వరలో అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 3-2తో విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ సందర్భంగా వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ భారత్‌లో అత్యుత్తమ ప్రదర్శనపై ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాతో తమ జట్టు ఆడటం చాలా ప్రత్యేకమైనదని అన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున పొలార్డ్ IPL ఆడాడు. రోహిత్ శర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ..’ఇంగ్లండ్‌పై విజయం సాధించడం గొప్ప విషయం. ఇప్పుడు భారత పర్యటనలో సానుకూల ఫలితం రావాలని కోరుకుంటున్నాం. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టుతో ఆడడం చాలా ప్రత్యేకమైనది ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ODI ఫార్మాట్‌లో మాకు కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మేము కొత్త ప్రతిభను కనుగొన్నాం. భారత్‌పై మా ప్రదర్శన అధ్భుతంగా ఉంటుంది’ అన్నాడు.
వెస్టిండీస్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌లోని కొంతమంది యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా అకీల్ హొస్సేన్, రొమారియో షెపర్డ్, రోవ్‌మన్ పావెల్ అద్భుతంగా రాణించారు. నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్ కూడా బలమైన ప్రదర్శన ఇచ్చారు. పొలార్డ్ భారత పర్యటనలో తన ఆటగాళ్ల నుంచి ఇదే విధమైన ప్రదర్శనను ఆశిస్తున్నాడు. వెస్టిండీస్ జట్టులో షిమ్రాన్ హెట్‌మన్‌కు చోటు దక్కలేదు. అతని ఫిట్‌నెస్ సరిగా లేకపోవడంతో జట్టుకు దూరంగా ఉంచారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల జట్టులో హెట్‌మెయర్ కూడా కనిపించలేదు.
భారత జట్టు అహ్మదాబాద్ చేరుకుంది
ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సభ్యులు అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆటగాళ్లందరూ ఆదివారం, సోమవారం మధ్య బయో బబుల్‌లోకి ప్రవేశించారు. ‘వారు మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు’ అని బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ తొలిసారిగా రెగ్యులర్ కెప్టెన్‌గా భారత పరిమిత ఓవర్ల జట్టులోకి ప్రవేశించనున్నాడు. కాలి కండరాల గాయం కారణంగా అతను దక్షిణాఫ్రికాకు వెళ్లలేకపోయాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ శనివారం అహ్మదాబాద్‌కు బయలుదేరిన చిత్రాన్ని పోస్ట్ చేశాడు. విమానంలో శిఖర్ ధావన్‌తో కలిసి కూర్చున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి రాగా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు.