Maruti Wagon R: ఫిబ్రవరిలో కొత్త మారుతి వ్యాగన్‌ ఆర్‌ విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Maruti Wagon R: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) 2021 సంవత్సరంలో 1,83,851 యూనిట్ల అమ్మకాలు జరిపితే అందులో మారుతి వ్యాగన్

Maruti Wagon R: ఫిబ్రవరిలో కొత్త మారుతి వ్యాగన్‌ ఆర్‌ విడుదల.. ధర, ఫీచర్లు ఎలా   ఉన్నాయంటే..?
Maruti Suzuki Wagonr
Follow us
uppula Raju

|

Updated on: Jan 31, 2022 | 7:46 PM

Maruti Wagon R: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) 2021 సంవత్సరంలో 1,83,851 యూనిట్ల అమ్మకాలు జరిపితే అందులో మారుతి వ్యాగన్ R అగ్రస్థానంలో ఉంది. ఈ కారు ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్‌ జనరేషన్ మారుతి సుజుకి వ్యాగన్ R 2019 ప్రారంభంలో అరంగేట్రం చేసింది. ఇది ఫిబ్రవరి 2022లో మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను పొందుతుందని చెప్పారు. ఇప్పుడు కొత్త మారుతి సుజుకి వ్యాగన్ R లో తేలికపాటి మార్పులు జరగవచ్చు. ముందు వైపున ట్వీక్ చేసిన బంపర్‌తో రావచ్చు.

టాప్-స్పెక్ వేరియంట్‌లో 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ చక్రాలు గత ఏడాది చివర్లో భారతదేశంలో ప్రారంభించబడిన సెకండ్-జెన్ సెలెరియో మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యాగన్ R 2019 ప్రారంభంలో స్టార్ట్‌ చేశారు. అప్పటి నుంచి పెద్దగా అప్‌డేట్‌లు ఏవీ చేయలేదు. ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా దీని బాహ్య భాగంలో తేలికపాటి మార్పులు చేశారు. ఇప్పుడు బంపర్‌లపై మార్పులు, కొత్త రంగులో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

2022 వ్యాగన్ R కొత్త కలర్ స్కీమ్‌ను పొందవచ్చని, కొన్ని మార్పులు ఉండవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. మరో గొప్ప విషయం ఏంటంటే AMT ట్రిమ్‌లలో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్ లభ్యత, ఇంజన్ మరింత ఇంధనాన్ని ఆదా చేయడానికి నిష్క్రియాత్మక స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో రావచ్చు. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన ఏడు-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్ ORVMలు, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఎక్విప్‌మెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు కొనసాగుతాయి. పనితీరు కోసం అదే 1.0-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను ఉంచవచ్చు. ఐదు-స్పీడ్ మాన్యువల్, ఐదు-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అలాగే ఉంటాయి. ప్రవేశ-స్థాయి LXI ట్రిమ్ కూడా CNG వేరియంట్‌ను అందిస్తుంది. బేస్ వేరియంట్‌కు దాదాపు రూ. 5.3 లక్షలు, టాప్-ఎండ్ మోడల్‌కి రూ. 6.8 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ధర ఉంటుంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 విక్రయాలు ప్రారంభం.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..

జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే సులభంగా తయారుచేయండి..?

క్రికెట్‌ కోసం రోజు 40 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేవాడు.. ఇప్పుడు టీమ్‌ ఇండియాకి ఎంపిక..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..