AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌ కోసం రోజు 40 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేవాడు.. ఇప్పుడు టీమ్‌ ఇండియాకి ఎంపిక..

Cricket News: ఫిబ్రవరి 6 నుంచి భారత జట్టు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఫాస్ట్ బౌలర్

క్రికెట్‌ కోసం రోజు 40 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేవాడు.. ఇప్పుడు టీమ్‌ ఇండియాకి ఎంపిక..
Avesh Khan
uppula Raju
|

Updated on: Jan 31, 2022 | 6:19 PM

Share

Cricket News: ఫిబ్రవరి 6 నుంచి భారత జట్టు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ ఆటగాడు ఇంతకు ముందు టీమ్‌ ఇండియాకి ఎంపికైనప్పటికీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. అయితే ఈసారి అవేష్ ఖాన్ కల నెరవేరవచ్చు. అవేష్ ఖాన్ కూడా ఈ ఛాలెంజ్‌కి రెడీగా ఉన్నాడు. వేగం, అద్భుతమైన బౌన్సర్లు, యార్కర్లు వేసి ఐపీఎల్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. టీమ్ ఇండియా ఎంపిక తర్వాత అవేశ్ ఖాన్ ఓ పెద్ద విషయం చెప్పాడు. ‘గత పదేళ్లలో మా నాన్న, అమ్మ, నేను చూసిన కష్టాల కథ చెబితే కేవలం 2 నిమిషాల్లో అయిపోతుంది. అనుభవించిన వాడికే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది’ అన్నాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఒక పేద ఇంట్లో పుట్టాడు. తన 11 ఏళ్ల కొడుకును 10 కి.మీ దూరం నడిపేందుకు ఆ తండ్రి దగ్గర డబ్బు లేదు. అకాడమీలో అవేష్ ఖాన్ ఎంపిక కూడా చాలా కష్టంగా జరిగింది. సెలక్టర్లు అతనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ హెడ్ కోచ్ పోరాడి అతనికి అకాడమీలో చోటు కల్పించాడు.

అవేష్ ఖాన్ 2007-08 సంవత్సరంలో ఇండోర్ కోల్ట్స్ క్లబ్‌లో చేరాడు. ఇది అవేష్ ఇంటికి 10 కి.మీ. దూరంలో ఉంటుంది. అవేష్ ఖాన్ ఉదయం, సాయంత్రం సైకిల్‌పై అకాడమీకి వెళ్లేవాడు. అంటే దాదాపు 40 కి.మీ. రోజూ సైకిల్ తొక్కేవాడు. 2010లో ఎంపీ క్రికెట్ అకాడమీలో చేరిన అవేశ్ ఖాన్ కెరీర్ మలుపు తిరిగింది. ఎంపీ క్రికెట్ అకాడమీ ట్రయల్‌లో అవేశ్ ఖాన్ 10 బంతులు మాత్రమే వేయగా సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అయితే అకాడమీ కోచ్ అమయ్ ఖురాసియా అతడిని ఎంపిక చేశాడు. అతడు తీసుకున్న నిర్ణయంతో సెలెక్టర్లు ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అవేష్ ఖాన్ ప్రతిభతో అందరిని మాట్లాడకుండా చేశాడు.

అవేష్ ఖాన్ IPLలో RCB జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. గత రెండు సీజన్లలో అవేష్ ఖాన్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిరంతరం 140 కి.మీ. వేగంతో బంతిని విసిరిన ఈ బౌలర్.. టీమిండియా నెట్ బౌలర్లకు చేరువయ్యాడు. ఇప్పుడు రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెస్టిండీస్ సిరీస్‌లో ఈ ఆటగాడికి అవకాశం ఇచ్చారు. మరి అవేష్ ఖాన్ ఎలా రాణిస్తాడో చూడాలి.

Ricky Ponting: టీమ్‌ ఇండియా టెస్ట్‌ కెప్టెన్‌గా నా మద్దతు అతడికే..?

Spiritual News: ఇంట్లో పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఈ విషయాల పట్ల అప్రమత్తత అవసరం..?