Ricky Ponting: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా నా మద్దతు అతడికే..?
Ricky Ponting: విరాట్ కోహ్లి రాజీనామా తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్‌ని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరిలో భారత్, వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది.
Ricky Ponting: విరాట్ కోహ్లి రాజీనామా తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్‌ని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరిలో భారత్, వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. దీని తర్వాత శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు ముందు బోర్డు టెస్ట్ కెప్టెన్ పేరును ప్రకటించవచ్చు. తదుపరి టెస్టు కెప్టెన్ రేసులో చాలా మంది పేర్లు ఉన్నాయి. ఇందులో భారత పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ పేరు ముందు వరుసలో ఉంది. రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది రోహిత్ పేరును సమర్థించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన రికీ పాంటింగ్ కూడా రోహిత్‌కు మద్దతు తెలిపాడు.
పాంటింగ్ ప్రస్తుతం IPL జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్నాడు. గతంలో రోహిత్‌తో కలిసి ముంబై ఇండియన్స్‌లో పనిచేశాడు. 2013లో పాంటింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా నియమించారు. అతని పేరును పాంటింగ్ సూచించాడు. ఇప్పుడు మరోసారి తన మాజీ భాగస్వామికి మద్దతు తెలిపాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ సాధించిన విజయాలే అతను విజయవంతమైన కెప్టెన్ అని చెప్పడానికి నిదర్శనమని పాంటింగ్ అన్నాడు. ఐసిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు.”రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అని నిరూపించాడు. టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కొన్ని సందర్భాల్లో చాలా విజయవంతమయ్యాడు. ఆటలో అగ్రస్థానంలో ఉన్నప్పుడు కెప్టెన్సీని పొందాలి. గత రెండు-మూడేళ్లలో అతడి ఆటతీరు చూస్తే అందరికి అర్థమవుతుంది. వేర్వేరు కెప్టెన్లు కావాలా లేదా అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ కావాలా అనేది బీసీసీఐ స్పష్టం చేయాల్సి ఉంది”.
విరాట్ సమయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేకి కెప్టెన్సీ ఇవ్వడంపై పాంటింగ్ ఇలా అన్నాడు. “నిజాయితీగా చెప్పాలంటే నేను అజింక్యాతో కలిసి పనిచేశాను. అతను అద్భుతమైన వ్యక్తి. అగ్రశ్రేణి ఆటగాడు. కానీ ఇటీవల కాలంలో టెస్టుల్లో బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను చాలా బాగా ఆడాడు”