EPFO: పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్.. ఈ విషయాల పట్ల అప్రమత్తత అవసరం..?
EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికీ ఒక ముఖ్యమైన నోటీసు జారీ చేసింది. ఇందులో ఖాతా
EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికీ ఒక ముఖ్యమైన నోటీసు జారీ చేసింది. ఇందులో ఖాతా భద్రత, ఖాతాలో జమ అయిన డబ్బు గురించి హెచ్చరించింది. ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా సోషల్ మీడియాలో ఖాతా సంబంధిత సమాచారాన్ని షేర్ చేయవద్దని సభ్యులందరినీ అప్రమత్తం చేసింది. ఆధార్ , పాన్, యూఏఎన్, బ్యాంక్ వివరాల గురించి ఈపీఎఫ్‌వో ఖాతాదారులను ఎప్పుడూ అడగదని తెలిపింది. ఎవరైనా అలాంటి సమాచారాన్ని ఫోన్ లేదా సోషల్ మీడియాలో అడిగితే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. అలాంటి మోసపూరిత ఫోన్ కాల్‌లకు స్పందించవద్దని, మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వకూడదని సూచించింది. దీనికోసం ఒక ట్వీట్ కూడా చేసింది.
ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు PF ఖాతాలో జమ అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం ఈ డబ్బుపై ఆధారపడతారు. మోసగాళ్లు తమ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆలోచించి ఫిషింగ్ దాడులు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఫిషింగ్ అనేది ఆన్‌లైన్ మోసం, దీనిలో ఖాతాదారుడిని మోసం చేసి ఖాతాకు సంబంధించిన వివరాలను తెలుసుకొని డబ్బులు కాజేస్తున్నారు. PAN నంబర్, ఆధార్ నంబర్, UAN, PF ఖాతా నంబర్ సమాచారం తెలిస్తే డిపాజిట్ చేసిన డబ్బు ప్రమాదంలో పడుతుంది. అందుకే వీటిని ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు. ఒక కంపెనీని విడిచిపెట్టి మరో కంపెనీలో చేరే సమయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతాయి. ఉద్యోగం వదిలి వేరే చోట చేరే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
EPFO ఛార్జ్ పేరుతో కూడా ఫోర్జరీ జరగవచ్చు. దీనితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు అలాంటి ఛార్జీని చెల్లించాలనుకుంటే అధికారిక మాధ్యమం సహాయం మాత్రమే తీసుకోండి. సైబర్ నేరగాళ్లు ఎల్లప్పుడు మోసం చేయడానికి సిద్దంగా ఉంటారు. ఇలాంటి వాటిని నివారించడానికి ఏకైక మార్గం ఫిషింగ్ దాడుల పట్ల జాగ్రత్తగా ఉండటమే.
#EPFO never asks its members to share their personal details like Aadhaar, PAN, UAN, Bank Account or OTP over phone or on social media.#EPFO कभी भी अपने सदस्यों से व्यक्तिगत विवरण जैसे आधार, पैन, यूएएन, बैंक खाता या ओटीपी फोन या सोशल मीडिया पर साझा करने के लिए नहीं कहता है। pic.twitter.com/4NhovLQ3xH
— EPFO (@socialepfo) January 29, 2022