Shoaib Akhtar: భారత్ టెస్ట్‌ల్లో ఎందుకు గెలుస్తుందో తెలుసా.. కారణం చెప్పిన పాకిస్తాన్ మాజీ బౌలర్..
టెస్టుల్లో భారత జట్టు విజయాలు సాధిస్తోంది. మొన్నటి దక్షిణాఫ్రికా సిరీస్ మినహా అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇండియాదే పైచేయి....
టెస్టుల్లో భారత జట్టు విజయాలు సాధిస్తోంది. మొన్నటి దక్షిణాఫ్రికా సిరీస్ మినహా అంతకుముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇండియాదే పైచేయి. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేసింది. టెస్ట్‌ల్లో భారత్ విజయానికి కారణం చెప్పాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. ఇండియా టెస్ట్‌లో గెలవడానికి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కారణమని చెప్పాడు. భారత్‌లో జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు ఉన్నారు. వారందరూ గొప్పగా బౌలింగ్ చేస్తారు. అయితే భారత జట్టు బౌలర్లలోని లోపాలను అక్తర్ ఎత్తి చూపాడు.
భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉందని, అయితే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ల కంటే వెనుకబడ్డారని అక్తర్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించగా, బౌలర్లు ఇందులో పెద్ద పాత్ర పోషించారు. ఇండియా, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ల మధ్య వ్యత్యాసం దూకుడు,శక్తి అని అన్నారు. భారత జట్టు మంచి ఫాస్ట్ బౌలర్‌లను ఉత్పత్తి చేస్తుందని, అయితే వారిలో శక్తి లేదని చెప్పాడు. “పాకిస్తాన్, భారత్ బౌలర్ల మధ్య చాలా తేడా ఉంది. భారత జట్టు గొప్ప ఫాస్ట్ బౌలర్లను తయారు చేస్తోంది. కానీ వారిలో శక్తి లేదు.” అని అక్తర్ చెప్పాడు.
పాక్ బౌలర్లు మరింత ప్రమాదకరంగా, శక్తివంతంగా ఉంటారని, ఎందుకంటే వారి ఆహారం మంచిదని అక్తర్ అన్నాడు. అక్తర్ పాకిస్తాన్ తరఫున 46 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 163 ODIలు, 15 T20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. అక్తర్ 1997లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 444 వికెట్లు తీశాడు.