జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే సులభంగా తయారుచేయండి..?

Jackfruit biryani: దాదాపు అందరూ ఇష్టపడే అత్యంత రుచికరమైన వంటలలో బిర్యానీ ఒకటి. జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఒక రుచికరమైన వంటకం.

జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే సులభంగా తయారుచేయండి..?
Jackfruit Biryani
Follow us
uppula Raju

|

Updated on: Jan 31, 2022 | 6:55 PM

Jackfruit biryani: దాదాపు అందరూ ఇష్టపడే అత్యంత రుచికరమైన వంటలలో బిర్యానీ ఒకటి. జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఒక రుచికరమైన వంటకం. వేడివేడిగా తింటే కలిగే ఆనందమే వేరు. రుచికరమైన నోరూరించే ఈ బిర్యానీని ఇంట్లో తయారు చేయడానికి మీకు ఎల్లప్పుడూ చికెన్, మటన్ అవసరం లేదు. ఫ్లూ సీజన్‌లో మటన్ లేదా చికెన్ తినకూడదని సూచించినప్పుడు జాక్‌ఫ్రూట్ గొప్ప ఎంపికవుతుంది. ఎందుకంటే దాని రుచి కొంచెం చికెన్ లాగా ఉంటుంది. దాని ఆకృతి రెడ్ మీట్, చికెన్ రెండింటిని పోలి ఉంటుంది. ఈ అద్భుతమైన జాక్‌ఫ్రూట్ బిర్యానీ చేయడానికి 40 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం.

జాక్‌ఫ్రూట్ బిర్యానీకి కావలసిన పదార్థాలు

250 గ్రాముల జాక్‌ఫ్రూట్,4 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ నల్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్లు బిర్యానీ మసాలా పొడి, ఉప్పు అవసరం, 6 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె, 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు, 1 స్పూన్ పసుపు, 2 కప్పులు బాస్మతి బియ్యం, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 బే ఆకులు, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ ఎర్ర మిరప పొడి, 2 కప్పుల నీరు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర, 1/4 కప్పు పెరుగు, జీడిపప్పు అవసరం మేరకు

ఎలా తయారుచేయాలి..?

రుచికరమైన జాక్‌ఫ్రూట్ బిర్యానీ చేయడానికి మీడియం మంట మీద పెద్ద ప్రెజర్ కుక్కర్‌ను పెట్టాలి. 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. అందులో బిరియాని ఆకులు, నల్ల మిరియాలు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. మసాలా దినుసులు వేసి, ఉల్లిపాయ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఎర్ర కారం, రుచికి తగిన ఉప్పు వేసి మళ్లీ కలపాలి.

జాక్‌ఫ్రూట్‌ను ప్రెషర్ కుక్కర్‌లో వేసి ఒక నిమిషం వేయించాలి. తేలికగా కవర్ చేసి 3 నిమిషాలు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అన్ని సుగంధ ద్రవ్యాలు పెరుగుతో ఉడికించాలి. కుక్కర్‌లో బిర్యానీ మసాలా, గరం మసాలా, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. దానిని మూతపెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. ఇది జాక్‌ఫ్రూట్ అన్ని రుచులను గ్రహించి మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడికించాలి.

నీరు వేసి మూత వేయాలి. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మంటను ఆపివేసి ప్రెజర్ కుక్కర్‌ను చల్లారే వరకు ఉంచాలి. తర్వాత మూత తెరిస్తే ఆవిరి మొత్తం బయటికి వెళ్లిపోతుంది. జాక్‌ఫ్రూట్ బిర్యానీ తీసి చల్లారనివ్వాలి. బిర్యానీని ప్లేట్‌లో వేసి జీడిపప్పు, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరంచాలి. గ్రీన్ చట్నీతో వేడిగా వేడిగా వడ్డిస్తే సరిపోతుంది.

క్రికెట్‌ కోసం రోజు 40 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కేవాడు.. ఇప్పుడు టీమ్‌ ఇండియాకి ఎంపిక..

Spiritual News: ఇంట్లో పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..?

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులు అలర్ట్‌.. ఈ విషయాల పట్ల అప్రమత్తత అవసరం..?