Lord Shiva: కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడిని.. సోమవారం ఏ విధంగా పూజ చేయాలంటే..

Monday Worship Tips: దేశంలో ఎక్కువమంది హిందువులు(Hindus ) పూజించే దేవుడు శివుడు(Lord Shiva). జలంతో అభిషేకించినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు.. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం(Monday)..

Lord Shiva: కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడిని.. సోమవారం ఏ విధంగా పూజ చేయాలంటే..
Lord Shiva Puja On Monday
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2022 | 3:27 PM

Monday Worship Tips: దేశంలో ఎక్కువమంది హిందువులు(Hindus ) పూజించే దేవుడు శివుడు(Lord Shiva). జలంతో అభిషేకించినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు.. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం(Monday). శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. శివయ్యని నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. ఈ కైసలనాథుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి . సోమవారం రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు..ఈ రోజున ఏ  శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం..

*శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం. పరమశివుని పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికీ లోటు ఉండదు . శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు . *జీవితంలో ఎంత పెద్ద సవాలు ఎదురైనా శివుడిని ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు . శివుడు తన భక్తులకు అన్నింటా విజయాన్ని ప్రసాదిస్తాడు . *శివుడు మంగళకారుడు. వ్యక్తి ఆధ్యాత్మిక సాధన, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. శివ సాధకునికి ఏ విధమైన రోగం , దుఃఖం కలగవు. *ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుడిని ఆరాధిస్తే, శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతారు. *శివుడు శక్తి స్వరూపుడు. కనుక ఆయన్ని ఆరాధించడం ద్వారా ధైర్యం , బలం, శక్తి లభిస్తుంది . శివ భక్తుని శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా , కాంతివంతంగా ఉంటుంది. *పరమశివుడుని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో.. అటువంటి భక్తులకు ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. *పెళ్లికాని అమ్మాయి ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే, ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం *పరమశివుని పూజించే వారికి ఎటువంటి శత్రువు భయం ఉండదు . శివుడిని ఆరాధించడం ద్వారా, ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించడంలో విజయం సాధిస్తాడు. *పరమశివుని ఆరాధన అన్ని రకాల భోగభాగ్యాలను ఇస్తూ.. చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

శివాలయంలో నాగుపాము హల్ చల్.. అర్ధరాత్రి శివ లింగం వెనుక దర్శనం.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..