తమ్ముడి కోసం 10 ఏళ్ల బాలిక తపస్సు! కోరిక తీర్చిన శివయ్యకు కన్వర్ యాత్రలో కృతజ్ఞలు ఎలా చెబుతుందంటే?

పూర్వ కాలం నుంచి కుటుంబం, బంధాలు, సంబంధాలకు మన సమాజంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి బంధాల్లో ఒకటి అన్నా చెల్లెళ్ళ లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న బంధం. ఉత్తరాదిలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా భాగల్పూర్‌లోని సుల్తంగంజ్‌లోని కచ్చి మార్గంలో చేపట్టిన కావిడి ఉత్సవ మార్గంలో తమ్ముడి పట్ల అక్కకు ఉన్న నిజమైన ప్రేమ కనిపించింది. అంతేకాదు తన కోరికను తీర్చిన శివయ్యకు ఆ చిన్నారి మొక్కుని తీరుస్తున్న విధానం పలువురిని ఆకట్టుకుంది.

తమ్ముడి కోసం 10 ఏళ్ల బాలిక తపస్సు! కోరిక తీర్చిన శివయ్యకు కన్వర్ యాత్రలో కృతజ్ఞలు ఎలా చెబుతుందంటే?
10 Year Riya Kanwar Yatra
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2024 | 7:09 AM

పిల్లలు దేవుడితో సమానం అని అంటారు. కల్లాకపటం తెలియని పిల్లలు పిలిస్తే ఆ దైవం కూడా దిగి వస్తుందని.. కోరిన కోర్కె తీరుతుందని హిదువుల నమ్మకం. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది తాజా సంఘటన. ఓ చిన్నారికి రాఖీ పండగ వస్తే రాఖీ కట్టడానికి తనకు ఒక తమ్ముడు ఉండాలని కోరుకుంది. అంతేకాదు శివయ్యకు తన కోరికను తెలియజేసింది. రోజూ పూజలు చేసింది. చిన్నారి నిర్మలమైన కోరికను శివయ్య తీర్చి చిన్నారి తల్లిదండ్రులకు ఒక బాలుడు జన్మించాడు. దీంతో తన కోరికను తీర్చిన శివయ్యకు కృతజ్ఞతను తెలియజేస్తూ కావిడి ఉత్సవాన్ని చేపట్టింది. ఈ అరుదైన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పూర్వ కాలం నుంచి కుటుంబం, బంధాలు, సంబంధాలకు మన సమాజంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి బంధాల్లో ఒకటి అన్నా చెల్లెళ్ళ లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న బంధం. ఉత్తరాదిలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా భాగల్పూర్‌లోని సుల్తంగంజ్‌లోని కచ్చి మార్గంలో చేపట్టిన కావిడి ఉత్సవ మార్గంలో తమ్ముడి పట్ల అక్కకు ఉన్న నిజమైన ప్రేమ కనిపించింది. అంతేకాదు తన కోరికను తీర్చిన శివయ్యకు ఆ చిన్నారి మొక్కుని తీరుస్తున్న విధానం పలువురిని ఆకట్టుకుంది.

వాస్తవానికి దర్భంగా నివాసి అయిన 10 ఏళ్ల చిన్నారి బాలిక రియ. శివయ్యను తనకు తమ్ముడిని వరంగా ఇవ్వమని కోరింది. తన కోరిక తీర్చమంటూ రోజూ శివాలయానికి వెళ్లి భిక్ష పెట్టుకునేది. రియా భక్తిలో ఆప్యాయత, నిస్వార్థ ప్రేమ ఉంది. మరి చిన్నారి రియా భక్తికి తమ్ముడంటే ఉన్న ఇష్టాన్ని గుర్తించిన శివయ్య కూడా సంతోషించినట్లున్నాడు. కొన్ని నెలల తర్వాత రియా తల్లి ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రియా తమ ఇంటికి వచ్చిన అతిథికి కన్హా అని పేరు పెట్టింది.

ఇవి కూడా చదవండి

కోరిక తీర్చిన శివయ్యకు రియా కృతఙ్ఞతలు

తన సోదరుడు పుట్టిన తరువాత రియా ఇప్పుడు శివయ్యకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకుంది. దీంతో తన తండ్రి, తల్లి, కన్హాతో కలిసి కష్టమైన భక్తి మార్గంలో తన భక్తిని, విస్వాశాన్ని చాటుకుంటుంది. కావిడి యాత్ర చేపట్టింది. భాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్ నుంచి కుండల్లో నీటిని నింపి తండ్రి ఆ కావిడి చేపట్టి తిరుగు ప్రయాణం అయితే.. రియా సాష్టాంగ నమస్కారం (అంటే నేలపై పడుకుని) చేస్తూ.. దేవఘర్‌లోని లార్డ్ బైద్యనాథ్ ఆలయంలో శివయ్యకు ఆ నీటిని సమర్పించడానికి 105 కిలోమీటర్ల ప్రయాణంలో బయలుదేరింది.

కచ్చి కవడియా యాత్ర జరుగున్న రహదారిలో చిన్నారి రియాతో మాట్లాడితే తనకు సోదరులు లేరని.. రక్షాబంధన్‌ వచ్చినప్పుడు తాను ఒంటరిగా ఉండేదానిని అని చెప్పింది. అందువల్ల తనకు రాఖీ కట్టేందుకు ఒక తమ్ముడిని ఇవ్వమని శివయ్యను కోరినట్లు.. తన మాటలు శివయ్య విన్నాడు. ఇప్పుడు తనకు తమ్ముడు ఉన్నాడు అని అమాయకంగా చెబుతోంది. అందుకే తాను శివయ్యకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నానని.. అందుకోసం కన్వర్ యాత్ర చేస్తూ బాబా బైద్యనాథ్ ఆలయానికి వెళ్తున్నట్లు.. చెప్పింది. నాన్న కన్వర్ యాత్ర కావిడి తీసుకుని వస్తున్నారని .. ప్రయాణం చేస్తున్న సమయంలో తమకు ఎటువంటి సమస్య లేదని చెబుతోంది. అంతేకాదు పెద్దయ్యాక డాక్టర్‌ కావాలనుకుంటున్నానని రియా చెప్పింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..