AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే రోజూ ఈ నాలుగు పనులు చేస్తే చాలు

ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు. కానీ, లక్ష్మీదేవి అనుగ్రహించిన వ్యక్తి మాత్రమే తన జీవితంలో భారీగా డబ్బు, సంపదను పొందగలడు.

లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే రోజూ ఈ నాలుగు పనులు చేస్తే చాలు
Goddess Lakshmi
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: May 26, 2023 | 9:30 AM

Share

ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు. కానీ, లక్ష్మీదేవి అనుగ్రహించిన వ్యక్తి మాత్రమే తన జీవితంలో భారీగా డబ్బు, సంపదను పొందగలడు. సంపదలకు దేవత అయిన తల్లి లక్ష్మి చంచలమైనది, ఆమె ఎక్కువసేపు ఒకే చోట ఉండదు. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి సదా నివసించేలా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయవలసి ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, ప్రతిరోజూ కొన్ని చర్యలు చేయండి, అప్పుడు లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటుంది.

1. తులసీ దేవి లక్ష్మీ స్వరూపం:

శాస్త్రం ప్రకారం తులసి దేవి లక్ష్మీ స్వరూపం. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది. ఇంట్లో తులసి మొక్కను నాటండి. ప్రతిరోజూ పూజ చేసి నీరు సమర్పించండి. తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటాలి. ఆది, బుధవారాల్లో తప్ప తులసి మొక్కను తాకడం వల్ల శరీరం శుద్ధి అవుతుందని, రోగాలు దూరమవుతాయని విశ్వాసం. తులసి దర్శనం వల్ల పాపాలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

2. ప్రతికూల శక్తి నాశనము:

శాస్త్రం ప్రకారం, ఇంట్లో ప్రతికూలతను తొలగించడానికి, ఆవు పేడతో చేసిన బెరణిపై ధూపం, గుగ్గలు కాల్చండి. దాని పొగను ప్రతి మూలలో వ్యాప్తి చేయండి. ఇది ఇంట్లో, కార్యాలయంలో చేయవచ్చు. ఈ విధానాన్ని మంగళవారం, గురువారం, శనివారం చేయాలి. ఇది ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని తొలగించి, సానుకూలతను కాపాడుతుంది. దీంతో పాటు ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

3. దీపం వెలిగించండి:

మాతా లక్ష్మి అనుగ్రహం పొందాలనుకునే వారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద, అరటి చెట్టు కింద ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి. అరటి చెట్టు కింద దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మూడుసార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది.

4. సంపాదనలో కొంత దానం చేయండి:

శాస్త్రం ప్రకారం, ప్రతి నెలా మీ జీతంలో కొంత భాగాన్ని దేవుని పేరు మీద ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. ఇది దేవుని దయ మీపై ఉండేలా చేస్తుంది. మరి కొంత డబ్బు సామాజిక సేవకు, మరికొంత డబ్బు ఖర్చులకు, పెట్టుబడికి పెట్టాలి. దీని ద్వారా మీరు దేవుని ఆశీర్వాదంతో కూడా డబ్బు పొందుతారు.

ఈ పైన పేర్కొన్న 4 పనులను రోజూ భక్తితో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. మీకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే పై 4 పనులు చేయండి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..