అక్షరధామ్ ఆలయంలో కనుల పండుగగా జల్ఝులని ఏకాదశి వేడుకలు.. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు..!
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో జల్ఝులని ఏకాదశిని ఘనంగా జరుపుకున్నారు. ఏడు రోజులపాటు ఘనంగా పూజలందుకున్న గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. గణేశుడిని పల్లకీలో కూర్చోబెట్టి, ఊరేగింపుగా తీసుకెళ్లి విగ్రహాన్ని పెద్ద సరస్సులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా, అనేక మంది సాదువులు, మహంతులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా గణపతి బప్పా మోర్య మంత్రంతో మార్మోగింది.

దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవ్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయంలో జల్ఝులని ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో పాటు, గణేష్ చతుర్థి రోజున ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహ నిమజ్జనం కనుల పండువగా సాగింది. ఈ సందర్భంగా, అనేక మంది సాదువులు, మహంతులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా గణపతి బప్పా మోర్య మంత్రంతో మార్మోగింది.
జల్ఝులని ఏకాదశి అని కూడా పిలువబడే జల్ఝుల్ని పండుగను భారతదేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా అక్షరధామ్ ఆలయంలో జరుపుకుంటారు. పూజ్య ధర్మవత్సల్ స్వామి జీ పవిత్ర సన్నిధిలో ఈ పండుగను ఈ రోజు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.
ఇక్కడ అక్షరధామ్ ఆడిటోరియంలో, ఒక పెద్ద కృత్రిమ సరస్సు సృష్టించారు. దీనిలో అక్షర-పురుషోత్తం గణపతి బప్పా విగ్రహాలకు స్నానం చేయించారు. భక్తులు భగవంతునికి ఐదు హారతులు, వివిధ భోగములను సమర్పించి భక్తితో కూడిన అర్ఘ్యాన్ని సమర్పించారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. భగవంతుడిని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహించారు. బప్పా పిల్లలకు ప్రాణ స్నేహితుడు, అందుకే ఈ సందర్భంగా చాలా మంది పిల్లలు కూడా కనిపించారు, వారు తమ తమ బప్పాను నిమజ్జనం చేశారు. మునివత్సల్ స్వామి జీ తన ప్రసంగంలో పండుగ సారాంశాన్ని వివరించారు. గాయకులు కీర్తనలు, భజనల భక్తితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
గత 40 సంవత్సరాల మాదిరిగానే, ఈసారి కూడా గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించింది ఆక్షరధామ్. ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ ఇతివృత్తంతో ఒక పండల్‌ను అలంకరించారు. గత 40 సంవత్సరాలుగా, గణేష్ పండుగ సమయంలో ఇక్కడ పండల్‌లను అలంకరించారు. ఏడు రోజులపాటు పూజలందుకున్న గణనాథుడికి వైభవంగా వీడ్కోలు పలికారు. ఈసారి థీమ్ ‘కోరికల దేవుడు’. అంటే, ‘గణేష్ జీ భక్తుల కోరికలను తీరుస్తాడు’. నగరం నలుమూలల నుండి భక్తులు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




