ఇప్పటికీ ఋషులు తిరగాడే వృక్షం అది.. చెట్టుపై ఏం కనిపించినా పేరు చెప్పకూడదంట.. పూర్తి వివరాలివే..
ఆలయ ప్రాంగణంలోని ఓ చెట్టుపై ఋషులు ఇప్పటికీ సంచరిస్తారు. ఆ మహర్షులు జీవుల రూపంలో సంచరిస్తారు. వారు అందరికీ కనిపించరు. ఆ జీవులు కనిపించినా వాటి పేరు మాత్రం పైకి చెప్పకూడదు అది అక్కడ నియమం. ఆ చెట్టు ఎక్కడ ఉందో తెలుసా..? ఇది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అది. అయితే అక్కడ ఈ తప్పు అసలు చేయకూడదు. చెట్టుపై మనకు జీవులు కనిపిస్తాయి. చెట్టు కొమ్మల్లో అవి కలిసిపోయి ఉంటాయి. అలా ఏదైనా జీవి రూపం కనిపించినా..
ఆ ఆలయ ప్రాంగణంలోని ఓ చెట్టుపై ఋషులు ఇప్పటికీ సంచరిస్తారు. ఆ మహర్షులు జీవుల రూపంలో సంచరిస్తారు. వారు అందరికీ కనిపించరు. ఆ జీవులు కనిపించినా వాటి పేరు మాత్రం పైకి చెప్పకూడదు అది అక్కడ నియమం. ఆ చెట్టు ఎక్కడ ఉందో తెలుసా..? ఇది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అది. అయితే అక్కడ ఈ తప్పు అసలు చేయకూడదు. చెట్టుపై మనకు జీవులు కనిపిస్తాయి. చెట్టు కొమ్మల్లో అవి కలిసిపోయి ఉంటాయి. అలా ఏదైనా జీవి రూపం కనిపించినా పేరు పెట్టి మాత్రం పైకి చెప్పకూడదు. పౌర్ణమి రోజున కొన్ని లక్షల మంది వచ్చే ఆ క్షేత్రంలో ఆ చెట్టు విశేషాలు ఇపుడు చూద్ధాం..
రెండు వృక్షాలు కలిసి ఒకే రూపంగా..
తమిళనాడు రాష్ట్రంలో అరుణాచల దివ్య క్షేత్రం ఉంది. పంచభూత లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడిని అరుణాచలేశ్వరునిగా కొలుస్తారు. ఈ అరుణాచలేశ్వరుడు పంచభూత లింగాల్లో అగ్ని లింగంగా కొలుస్తారు. దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతోమంది భక్తులు అరుణాచల క్షేత్రాన్ని దర్శించి, భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు, విశేషాలు, మరెన్నో వింతలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ సిద్దులు (అంటే మహా ఋషులు) అనేక రూపాలలో ఉన్నారని, వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని వేద పండితులు చెబుతున్నారు. అరుణాచలేశ్వరుని ప్రధాన ఆలయంలో నాలుగు ప్రదేశాల్లో ఋషులు ఇప్పటికీ ఉన్నారని చెబుతారు.
అందులో ఒక ప్రదేశమే ఈ మహిమాన్విత వృక్షం. కిలి గోపురం దాటగానే కుడివైపున ఆలయ ఈశాన్య భాగంలో పంచభూత లింగాల ఆలయాలు ఉంటాయి. అక్కడే బిడారి అమ్మన్ ఆలయం ఉంది. అమ్మవారు క్షేత్రపాలికగా పూజలు అందుకుంటూ మహా శక్తివంతమైన దేవతగా భక్తులతో కొలవబడుతుంది. ఆలయానికి ఎదురుగా ఓ వృక్షం ఉంది. అది చూడడానికి ఒకే వృక్షంగా ఉన్న అందులో రావి చెట్టు, మారేడు చెట్టు రెండూ ఒకదానితో ఒకటి కలిసి ఒకే వృక్షంగా కనబడుతుంది. ఒక చెట్టు లోపల నుంచి మరొక చెట్టు పెరగటం ఎంతో విచిత్రం. ఇలాంటి దృశ్యం ఎక్కడా చూడలేము. అలా ఉండడాన్ని బదనికలు అంటారు. బదనిక అంటే తంత్రం అని అర్థం. దీనికి సంబంధించి బదనిక శాస్త్రం కూడా ఒకటి ఉంది. ఈ బదనిక శాస్త్రం ద్వారా ఎన్నో సిద్ధులు( శక్తులు) పొందవచ్చని అని చెబుతారు.
సాధారణంగానే రావి చెట్టు, మారేడు చెట్టు చాలా శక్తివంతమైన వృక్షాలు.. అలాంటి శక్తివంతమైన వృక్షాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండటం చాలా అద్భుతం అలాగే మహిమాన్వితం. అంతేకాక ఆ వృక్షంపై ఆ క్షేత్రంలో ఉన్న సప్త ఋషులు ఒక జీవి (జీవి అంటే ఉదాహరణకు బల్లి) రూపంలో ఉన్నారు అని అక్కడ భక్తుల నమ్మకం. అంతేకాక ఆ జీవి పేరు చెప్పకూడదు అనే నియమం ఉంది. ఆ జీవులు కనిపించినా అక్కడ ఎవరు పేరుతో వాటిని పిలవరు. సాధారణంగా ఆ జీవులు చెట్టు రంగులో కలిసిపోయి ఎవరికీ కనిపించవు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ జీవులు కనిపించవు. అక్కడున్న సప్త ఋషులు ఆ జీవుల రూపంలో ఆ వృక్షంపై ఉన్నారని భక్తుల నమ్మకం. అయితే ఒకేసారి ఎవరికి ఏడు జీవులు కనిపించవు. ఒకటో రెండో మాత్రమే కనిపిస్తాయి.
అవి కనిపించినప్పుడు జీవులు, సిద్దులు, మాతృకలు అని మాత్రమే పిలవాలి. వాటి పేరు పెట్టి మాత్రం పిలవకూడదు. అయితే ఆ ప్రదేశంలో ఎక్కడా కూడా వాటిని పేరుతో పిలవకూడదు అని సూచించే బోర్డులు కూడా ఉండవు. ఎవరైనా అరుణాచల క్షేత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ వృక్షం వద్ద ఈ నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఆ క్షేత్రం ఎంతో మహిమాన్విత క్షేత్రంగా పూజలందుకుంటుంది. అక్కడున్న ప్రతి ప్రాకారంలో ఎన్నో రహస్యాలు, విశేషాలు దాగి ఉన్నాయి.