- Telugu News Photo Gallery Cricket photos List of cricketers, represented both India and Pakistan in international Test matches
Cricket Facts: భారత్ తరఫున ఆడిన పాక్ క్రికెటర్లు వీరే.. లిస్టులో ‘పాకిస్థాన్ క్రికెట్ పితామహుడు’ కూడా..
India & Pakistan Cricketers: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే చూసేందుకు క్రికెట్ ప్రపంచం అంతా తయారైపోతుంది. తమ జట్టు ఓడిపోతే టీవీలు, ఫోన్‌లు పగలగొట్టే అభిమానులు పెద్ద మొత్తంలోనే ఉన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరిగితే అలాంటి హై ఓల్టేజ్ వాతావరణం ఉంటుంది. అయితే భారత్ కోసం క్రికెట్ ఆడిన పాకిస్థాన్ ప్లేయర్లు ఉన్నారని మీకు తెలుసా..? వారు ఇరు దేశాల తరఫున కూడా ఆడారు. వారి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 08, 2023 | 9:04 PM

భారత్ తరఫున క్రికెట్ ఆడిన పాకిస్థాన్ ప్లేయర్ల లిస్టులో మొదటి పేరు అబ్దుల్ హఫీజ్ కర్దార్. ఇరు దేశాల విభజనకు ముందు హఫీజ్ భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. దేశ విభజనకు ముందు హఫీజ్ భారత్ కోసం 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

అయితే భారత్-పాకిస్థాన్ విభజన అనంతరం పాకిస్థాన్‌లోనే ఉండిపోయిన హఫీజ్ ఆ దేశం తరఫున 26 టెస్టులు ఆడాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మొదటి కెప్టెన్‌గా వ్యవహరించిన హఫీజ్‌కి ‘పాకిస్తాన్ క్రికెట్ పితామహుడు’ అనే గుర్తింపు కూడా ఉంది.

భారత్ తరఫున క్రికెట్ ఆడిన రెండో పాకిస్థానీ ప్లేయర్ గుల్ మహ్మద్. భారత్ కోసం 8 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మహ్మద్ 1952లో పాకిస్థాన్‌కి వెళ్లిపోయాడు.

కానీ పాక్ తరఫున అతను కొద్ది కాలం మాత్రమే ఆడాడు. పాక్ తరఫున ఒక్క టెస్ట్ మాత్రమే ఆడిన అతన్ని ఫామ్ కోల్పోయాడంటూ పక్కన పెట్టేశారు.

భారత్, పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడిన మూడో ఇంకా చివరి ప్లేయర్ అమీర్ ఎలాహీ. దేశ విభజనకు కొద్ది రోజుల ముందే అమీర్ భారత్ తరఫున ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అనంతరం పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్న అమీర్, పాక్ తరఫున 5 టెస్ట్ మ్యాచ్‌లే ఆడాడు.

కాగా.. అబ్దుల్ హఫీజ్ కర్దార్, గుల్ మహ్మద్, అమీర్ ఎలాహీ మాత్రమే ఇరు దేశాల క్రికెట్ చరిత్రలో చెరగని గుర్తింపు పొందారు. అఖండ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లుగా నిలిచారు.





























